జగన్... మంచి పని చేశావు !!... అంటూ మెచ్చుకున్న చిరంజీవి

August 10, 2020

కీలక నిర్ణయాల్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోవటంలోనే పాలకుల విజయం ఉంటుంది. పాలనలో ఊహించనలేనంత వేగాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. నేరాలకు పాల్పడే వారికి వణుకు పుట్టేలా తీసుకున్న సంచలన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచార నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలు.. నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠినశిక్ష విధించేలా ముసాయిదా బిల్లును తీసుకురావటం తెలిసిందే.

దిశ హత్యాచార ఘటన జరిగిన తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. పక్కనే ఉన్న ఏపీలో మాత్రం బాధిత మహిళ పేరుతో చట్టాన్ని తెచ్చిన వైనాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ ముసాయిదా బిల్లుకు తాజాగా కేబినెట్ లోనూ ఆమోదం తెలపటం తెలిసిందే.
ఏపీ దిశా చట్టం 2019తో తీసుకురానున్న ఈ చట్టంలో తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత మేలు కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకురానున్న చట్టంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాజాగా తీసుకురానున్న చట్టంతో సీఆర్పీసీని సవరిస్తారు.
దీని ద్వారా నాలుగు నెలలు అంతకంటే ఎక్కవగా పట్టే విచారణా సమయాన్ని కేవలం 21 రోజులకు కుదించటం.. ప్రత్యే కోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించటంతో పాటు ఐపీసీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచటం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు విధించాలన్న నిర్ణయాలు ఉన్నాయి. దీంతో నేరం చేయాలంటేనే భయపడేలా తాజా చట్టం ఉండనుందన్న మాట వినిపిస్తోంది.