చంద్రబాబు గురించి చిరంజీవి ఏం చెప్పాడు?

June 05, 2020
CTYPE html>
70 సంవత్సరాల వయసులో చంద్రబాబు అంతటి యాక్టివ్ పొలిటీషియన్ ఎవరూ లేరు. పాతికేళ్ల యువకుడికి ఉన్నంత శక్తి, ఓర్పు 70 ఏళ్ల చంద్రబాబులో కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు బర్త్ డే కావడంతో పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చంద్రబాబుతో కలసిన ఒక ఫొటోను షేర్ చేస్తు ఆయనను ఎంతగానో కీర్తించారు.
చిరంజీవి మాటల్లోనే....
అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. Wishing you a happy 70th Birthday Sir 
@ncbn  Your vision, your hard work, your dedication are exemplary  
 
ఇది చిరు ఇచ్చిన ప్రశంస. అంతేగా మన కళ్ల ముందున్న 70 ఏళ్ల యువకుడు చంద్రబాబు. ఇటీవల చిరంజీవి తన స్టైల్ మొత్తం మార్చాడు. తాను ఒక మాజీ రాజకీయ నేత అనే విషయాన్ని ఉద్దేశపపూర్వకంగా చిరంజీవి విస్మరిస్తున్నాడు. అడుగడుగునా తాను ఒక సినిమా వ్యక్తిని మాత్రమే అని భావిస్తూ ముందు కు వెళ్తున్నారు. అందుకే ఆయన ఎవరిని కలిసినా ఆయన పలకరింపులు, విషెస్ మెగాస్టార్ చిరంజీవి స్టైల్లోనే ఉంటున్నాయి గాని మాజీ మంత్రి చిరంజీవి స్టైల్లో ఉండటం లేదు.