సినీ కార్మికులకు పెద్ద అనిపించుకున్న చిరు

August 07, 2020

కరోనా దెబ్బకు దాదాపుగా అన్ని రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిన్నా చితకా పనులు చేసుకునేవారు, దినసరి కూలీలు, రోజువారీ వేతన జీవులు, అల్ప ఆదాయ వర్గాల వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా దెబ్బకు సినిమా షూటింగ్ లు, థియేటర్లు కూడా మూతపడడంతో సినీ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కరోనాపై పోరాటంలో భాగంగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రాం చరణ్, ప్రభాస్ లు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులలకు తమ వంతుగా భారీ సాయం అందించారు. అదే బాటలో తాజాగా, సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్టు చిరు చెప్పారు. తన విరాళం ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నానని చిరు అన్నారు. 

కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు భారత్ లాక్ డౌన్ అయింది. ఈ నేపథ్యంలోనే పలువులు అల్పాదాయ వర్గాల వారు, నిరు పేదలు పస్తులుండే పరిస్థితి వచ్చింది. వారిని ఆదుకునేందుకు సినీ తారలు, సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. కష్టకాలంలో ఆదుకునేందుకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు దర్శకులు...ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు సాయం అందించారు. కేంద్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కోటి రూపాయలు....ఇరు తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి సాయం అందించారు. మహేష్ బాబు, ప్రభాస్ లు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కోటి రూపాయల చొప్పున సాయం అందించారు. రాంచరణ్ ..కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి రూ.70లక్షల విరాళం ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్ లు రూ.20లక్షల చొప్పున సాయం చేశారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి..ఈ ఇద్దరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి వేరు వేరుగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తాను నటిస్తున్న కొత్త చిత్రం 'నాంది' చిత్ర యూనిట్ లో పని చేస్తున్న 50 మంది కార్మికులకు నిర్మాత సతీశ్ వేగేశ్నతో కలిసి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున సాయం అందించారు. 

 

 

 

 

-: CLEANED :-