మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు ఎందుకిచ్చాడు?

May 26, 2020

మా సమావేశం గొడవ ఇపుడు ఇండస్ట్రీలో పెద్ద టాపిక్ అయిపోయింది. సినిమా వాళ్లలోనే కాదు, అసలు బయటి జనాల్లో కూడా టాలీవుడ్ గొడవ గురించే చర్చ. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన ఈ గొడవను చూసి అందరూ షాక్ తిన్నారు. అయితే... ఈ గొడవ సంగతి పక్కన పెడితే అదే వేదిక మీద కనిపించిన ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. 

లెజెండ్ - సెలబ్రిటీ గొడవ తెరపైకి వచ్చినప్పటి మోహన్ బాబుకు ఇండస్ట్రీలో ఎవరితో పొసగదు అనుకున్నారు. ముఖ్యంగా చిరంజీవికి మోహన్ బాబుకు మధ్య సంబంధాలు లేవు అనుకున్నారు. కానీ అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు చిరు. వీరిద్దరు ఏ రోజూ సరదాగా మాట్లాడుకున్నది లేదు. కానీ ఈరోజు ఏకంగా మోహన్ బాబుకు చిరు ఘాటు ముద్దు ఇచ్చారు. 

మా వేదికపై నటుడు మోహన్ బాబు మాట్లాడుతున్న సమయంలో చిరు ఇంప్రెస్ అయిపోయాడు. ఆయన్ను ఆత్మీయంగా హత్తుకొని బుగ్గ  మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఈ ఘటన అక్కడి వారిని విస్మయానికి గురిచేయడమే కాదు... అందరి మొహంపై నవ్వులు పూయించింది.  

ఇంతకీ మోహన్ బాబు ఏం మాట్లాడారంటే... ’’ఒకప్పుడు ఎన్టీఆర్.. ఏఎన్నార్.. శివాజీలు ఒకే వేదిక మీద కూర్చొని సరదాగా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేవారు. అదే రీతిలో తానూ.. చిరంజీవి కూడా ఎక్కడైనా కలిస్తే ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటాం. అదంతా సరదాకే తప్పించి.. నిజంగా తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.‘‘  ఈ మాటలు చిరంజీవిని ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే వెంటనే కౌగిలించుకుని ముద్దు పెట్టారు.