ఊహించని వ్యక్తిని నామినేట్ చేసిన చిరంజీవి

August 09, 2020

టాలీవుడ్లో కొన్ని రోజులుగా #BeTherealmen ఛాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సందీప్ వంగా మొదలుపెట్టి... రాజమౌళికి టాగ్ చేసిన ఈ ఛాలెంజ్ అలా మెల్లగా విస్తరిస్తోంది. దీని గురించి కీరవాణి ’ఇది కరోనా వైరస్ కంటే ఘోరంగా విస్తరిస్తోంది‘ అంటూ చమత్కారమైన కామెంట్ చేశారు. పరిస్థితి చూస్తుంటే నిజంగా అలాగే ఉంది.

ఈరోజు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న చిరంజీవి తాజాగా తన వీడియో పెట్టారు. వాక్యూమ్ క్లీనరుతో ఇల్లు శుభ్రం చేశారు. చిరంజీవికి మంచి వంట కూడా వచ్చండోయ్. తాజాగా అమ్మకు దోసెలు వేసి పెట్టారు. అమ్మ అంటే అమ్మే. తన కొడుకు తనకు దోసెలు వేసి పెడితే చిరుకు ఆమె గోరు ముద్దలు తినిపించింది. మెగాస్టార్ అయినా అమ్మకు కొడుకే కదా. అమ్మ ప్రేమకు తిరుగేముంటుంది.

ఇక ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన చిరంజీవి ఎవరిని నామినేట్ చేశాడో తెలుసా... టీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కి టాస్క్ బదిలీ చేశాడు. అతనితో పాటు పాపం రజనీకాంత్ కి కూడా పని పెట్టాడు. చిరంజీవి ఏం చేసినా రచ్చేనబ్బా... చిలిపితనం మరీ పెరిగిపోతోంది.