బాలయ్య విరాళం గురించి చిరంజీవి కామెంట్స్

August 03, 2020
CTYPE html>
కరోనా పై పోరాటానికి ప్రతి పౌరుడు తనవంతుగా పోరాడుతున్నాడు. ముఖ్యంగా ఆపద సమయంలో సెలబ్రిటీలు పెద్ద స్థాయిలో ఆర్థిక సాయం అందిస్తున్నారు. పవన్ రెండో కోట్లతో ప్రారంభించి అందరికీ పెద్ద టార్గెట్లే పెట్టాడు. ఇప్పటికే చిరంజీవితో సహా చాలామంది విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ కూడా స్పందించారు. తనవంతుగా ఆయా ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. కోటి పాతిక లక్షలు విరాళంగా ప్రకటించిన బాలయ్య... కరోనా అంతం చేయాలంటే అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సందేశం కూడా పంపారు. 
ఆయన ఏపీ ఎమ్మెల్యే అయినా... అంతకంటే ముందు తెలుగు నటుడు కాబట్టి ఇరు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి 50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు ప్రకటించారు. ఇక తమతో పనిచేసే పేద సినీ కార్మికుల కోసం చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)కి 25 లక్షలు విరాళమిచ్చి తన ఉదారతను చాటుకున్నారు నందమూరి బాలయ్య. ఈ చెక్కును సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు కల్యాణ్‌ కు బాలయ్య అందజేశారు. 
బాలకృష్ణ విరాళంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రియమైన సోదరుడు బాలకృష్ణ ఉదారతకు కృతజ్ఞతలు అంటూ చిరు ట్వీట్ చేశారు. సీసీసీకి రూ.25 లక్షలు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారని, ఇటువంటి విపత్తులు వచ్చినపుడు తన వంతు సాయం చేయడంలో బాలకృష్ణ ముందుంటారని ప్రశంసించారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి బాలయ్య ఎపుడూ ముందే ఉంటారన్నారు. చిరు బాలయ్య ఇద్దరు ఒకే రకమైన మొత్తాన్ని విరాళంగా ప్రకటించినట్లయ్యింది.