బాలకృష్ణకు చిరంజీవి సర్ ప్రైజ్

August 07, 2020

బాలయ్య అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా తమ అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే... కొద్ది రోజులుగా సినిమా పెద్దల వ్యవహారంపై బాలకృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు. నాగబాబు అనవసరంగా రియాక్టై సినిమా వివాదాన్ని చిరంజీవి వివాదంగా మార్చారు. కానీ చిరంజీవి మాత్రం వాటినేమీ పట్టించుకోకుండా బాలయ్యను సర్ ప్రైజ్ చేశారు. తాజాగా బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షల చెప్పారు చిరంజీవి. తన ట్విట్టరు అక్కౌంట్ ద్వారా బాలయ్యను విష్ చేశాడు.

60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి  షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday 

ఇది చిరంజీవి చేసిన పోస్టు. చిరు విషెస్ చెప్తాడా లేదా అని ఇండస్ట్రీలో చర్చ నడిచింది. అయితే... ఈ సందర్భంలో ట్వీట్ వేయకపోతే ఇంతకాలం జరిగిన దానిని స్వయంగా చిరంజీవి వివాదంగా పరిగణించినట్టు ఉంటుంది. ట్వీట్ వేయడమే కాకుండా ‘‘మా బాలకృష్ణ’’ అనడం ద్వారా చిరంజీవి వివాదాలు ఆపాలని కోరినట్టు అయ్యింది. అందరూ కలిసి ఉంటే అందరికీ మంచిదే. కాకపోతే విడదీసి గొడవలకు కారణమైంది మాత్రం బాలయ్య కాదు. 

కింద వీడియలో ఈరోజు బాలయ్య ఉత్సాహంగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం చూడొచ్చు.