పాపం... చిరు చిన్నల్లుడు !

September 17, 2019

కొంత‌కాలం క్రితం వ‌ర‌కూ ఆడ‌పిల్ల‌లు త‌ర‌చూ వేధింపుల‌కు గురి అవుతుండేవారు. సోష‌ల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. వాళ్లు.. వీళ్లు అన్నోళ్లు తేడా లేకుండా ఎవ‌రైనా.. ఎప్పుడైనా వేధింపుల‌కు గుర‌య్యే విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదురైంద‌ని చెప్పాలి. సామాన్యుల సంగ‌తి ఎదోలా ఉన్నా.. ప్ర‌ముఖుల పరిస్థితి మాత్రం కాస్తంత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎవ‌రు ఎప్పుడు ట్రోల్ చేస్తారో.. మ‌రెవ‌రు టార్గెట్ చేస్తారో అర్థం కాని ప‌రిస్థితి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ కు సోష‌ల్ మీడియాలో వేధింపులు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇన్ స్టాగ్రామ అకౌంట్లో కొంద‌రు ఆయ‌న్ను దూషిస్తూ కామెంట్స్ చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.
ఐదు రోజుల క్రితం క‌ల్యాణ్ దేవ్ వ్య‌క్తిగ‌త ఖాతాలో కొంద‌రు వ్య‌క్తులు అస‌భ్య ప‌ద‌జాలంతో దారుణంగా దూషిస్తున్నారు. వారంతా ఫేక్ అకౌంట్స్ త‌యారు చేసుకొని.. బూతులు తిడుతున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. క‌ల్యాణ్ దేవ్ తాజాగా సైబ‌ర్ పోలీసుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు.
క‌ల్యాణ్ దేవ్ ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు ఎఫ్ఐఆర్ ను న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ యాజ‌మాన్యానికి పోలీసులు లేఖ రాశారు. వారి నుంచి డిటైల్స్ వ‌చ్చినంత‌నే చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెబుతున్నారు. ముసుగు వేసుకొని మ‌రి మెగాస్టార్ చిన్న‌ అల్లుడ్ని టార్గెట్ చేస్తున్న వారెవ‌రో పోలీసుల ద‌ర్యాప్తులో తేల‌నుంది.