నేను ముఖ్యమంత్రి ని చెబుతున్నా జరగదా ?

November 12, 2019

సీ.ఎం జగన్ మోహన్ రెడ్డి విచిత్రవాదన..
అవాక్కైన అధికారులు, మంత్రులు.

చట్టానికి , నిబందనలకు విరుద్ధంగా వెళ్లి చంద్ర బాబు మాజీ సీ.ఎం అయ్యారని వై.సీ.పీ ముక్త కంఠం తో అపోజిషన్ పై నిప్పులు చెరుగుతోంది.

అయితే గురువింద చందంగా జగన్ మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు ఇటు మంత్రులకు,అటు అధికారులకు మింగుడు పడక, ఏం చెబితే ఎలా రియాక్టవుతారో ననే భయం తో వణికిపోతున్నారట.

ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ను పక్కన పెట్టి మరీ జరిపిన క్యాబినెట్ సమావేశం లో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు బయటకు రాకపోయినా....ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి విపరీత పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తోందో అని గుటకలు మింగుతున్నారు.

గురువారం ఉదయం జరిగిన క్యాబినెట్ సమావేశం లో జరిగిన సంఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. తొలుత‌ క్యాబినెట్ అజెండా గా ఎనిమిది అంశాలు అనుకోగా తర్వాత వాటిని 22 అంశాల కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతా బాగుంది, తన మానిఫెస్టో లోని సంక్షేమ పథకాలన్నీ ఆచరణ లో పెట్టాలంటే, ఆర్థికంగా పరిపుష్టత లేని ఖజానా ను చూసుకోకుండా వాటిని అమలు చేయడం ఎలా అన్న దానిపై అధికారులు, మంత్రులు సందేహాలు వ్యక్తం చేయడం తో వారిపై జగన్ తీవ్ర ఆవేశం తో ముఖ్యమంత్రి ని, నేను చెబుతున్నా కానీ చేయరా అంటూ ఊగిపోవడం తో బిక్కమొహాలు వేయడం అందరి వంతుగా మారింది.
ఇక క్యాబినెట్ అజెండా లో పరిశ్రమ ల శాఖలో ఉద్యోగ కల్పన అంశం లో ఏకంగా ఆ శాఖ మహిళా అధికారి పై జగన్ ప్రవర్తించిన తీరు తో కాబినెట్ సమావేశం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యిందని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. తన పాదయాత్ర లో హామీల్లో భాగంగా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చాడు జగన్..ఆ అంశం తాజా కాబినెట్ సమావేశం లో, అటు అధికారులకు, ఇటు మంత్రుల పాలిట శాపం గా మారింది. గత మూడేళ్లుగా నియమించిన ఉద్యోగాల్లో స్థానికులు కాని వారెవరో చూసి, వారి స్థానం లో అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఓ చట్టాన్ని తయారు చేసి త్వరగా అమలు చేయాలని కాబినెట్ సమావేశం లో ఆదేశించారు.అయితే ఆ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి ఇది ఆచరణకు సాధ్యం కాదని,.అలా చేస్తే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అమె చెప్పబోయారు..ఇంతలో జగన్ ఒక్కసారిగా ఆగ్రహం తో ఊగిపోతూ అంటే నేను ఇలా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదూ..మా ఉదయలక్ష్మి చెప్పే చట్టాలు, నిబంధనల వల్ల మీకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాలా అనడం తో ఒక్కసారిగా సమావేశం లో అందరి ముఖాలు తెల్లబోయాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే సీ.ఎం హామీ అమలు చేయడానికి ఇతర మార్గాలున్నాయని చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించే లోగా తన చేతిలో వున్న పేపర్లు ను టేబుల్ పై విసురుగా పడేసి అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ కాబినెట్ సమావేశం లో నుండి జగన్ బయటకు వెళ్లిపోవడం తో అధికారులు, మంత్రులు షాక్ కు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసెంబ్లీ జరుగుతున్న సమయం.లో కాబినెట్ జరపటం లో తప్పులేదు కానీ ఆ విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్ కు, ప్రతిపక్షాలకు తెలపకుండా సమావేశం జరిపారు. దీంతో యథా ప్రకారం స్పీకర్ సమావేశాలను అనుకున్న సమయానికే ప్రారంభించేసారు..దీంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు అసెంబ్లీ నడిపే తీరుపై మండిపడటం తో ప్రభుత్వ పనితీరు, జగన్ ఏక పక్ష నిర్ణయాలతో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లోను, ఇటు మంత్రులు, ఎమ్మెల్యే ల లోను భయం మొదలైందని మంత్రులు కక్కలేక మింగలేక పోతున్నారని అసెంబ్లీ లాబీల్లో చర్చించుకుంటున్నారు.

 

RELATED ARTICLES

  • No related artciles found