కరోనాకు కేసీఆర్ మందు ఏంటో తెలుసా??

June 03, 2020

కేసీఆర్ బాంబు పేల్చాడు. డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకుందాం... మనుషులు పోతే సంపాదించుకుంటామా? మోడీకి రిక్వెస్ట్ చేస్తున్నా... దయచేసి లాక్ డౌన్ కొనసాగించండి. 15తో ఆపొద్దు. పోటుగాళ్లు అనుకున్న దేశాలే లాక్ డౌన్ తప్ప వేరే దిక్కులేదు అనుకుంటున్నాయి. కానీ సింగపూర్ కూడా లాక్ డౌన్ పెట్టింది. అయ్యా నేషనల్ మీడియా ఇంగ్లిష్ హిందీలో కూడా చెప్తా. లాక్ డౌన్ కొనసాగించాలి. శవాల గుట్టలు మనదేశంలో మన కళ్లతో మనం చూడలేం. లాక్ డౌన్ లేకపోతే జనాల్ని కంట్రోల్ చేయలేం అని కేసీఆర్ ఏకధాటిగా మోడీకి రిక్వెస్ట్ చేశారు. 

కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది.  అయితే క‌రోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌న్న సంకేతాలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. తబ్లిగి ఘటన తర్వాత, కేసులు పెరుగుతున్న తీరు చూసి జనం కూడా దీనికి మానసికంగా సిద్ధమైపోయారు. కేంద్రం కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే కేసీఆర్ మాత్రం దీనిని గట్టిగా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేంద్రం ఎత్తేసినా కేసీఆర్ వెనక్కు తగ్గేలా లేడు. రాష్ట్రంలో మాత్రం కచ్చితంగా లాక్ డౌన్ కొనసాగుతుందని అర్థమైపోయింది. ఇప్పటికే తాను మోడీకి ఈ విషయం చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు

ఈ సందర్భంగా మొన్న అందరికీ జీతాలు కోసిన కేసీఆర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు సీఎం గిఫ్ట్ కింద ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తున్నట్లు చెప్పారు. మనకు ఎన్ని ఇబ్బందులున్నా మనకోసం ప్రాణాలు అడ్డుపెడుతున్నవారికి ఈ మాత్రం మనమిచ్చుకోవాలని చెప్పారు. సఫాయి కార్మికులకు అయితే 7500 ప్రోత్సాహకం ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఇబ్బందుల‌ు ఉణ్నా క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్భందికి, హాస్పిటళ్ల‌లో స్వీపర్లకి, క్లీన‌ర్ల‌కి అంద‌రికీ చేతులెత్తి దండం పెడుతున్నాన‌ని.. వాళ్ల‌కెంత మొక్కినా తక్కువే అని, వారి త్యాగం చాలా గొప్పద‌ని కేసీఆర్ కొనియాడారు.