విషాదంలో హాస్యనటుడు అలీ

May 26, 2020

బుల్లితెర.. వెండితెర హాస్యనటుడు అలీకి ఈ రోజు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో మరణించారు. ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె ప్రస్తుతం ఏపీలోని రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఆలీ.. షూటింగ్ లో భాగంగా రాంచీలో ఉన్నారు.
తల్లి మరణవార్త గురించి తెలిసినంతనే ఆలీ హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. అంతేకాదు.. ఆలీ తల్లి భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అంత్యక్రియల్ని హైదరాబాద్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బంధువులు చూస్తున్నారు.
ఆలీ తల్లి భౌతికకాయం ఈ రోజు మధ్యాహ్నానానికి హైదరాబాద్ కు చేరుకుంటుందని.. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారని చెబుతారు. తన తల్లి మీద ఉన్న ప్రేమను ఆలీ తరచూ ప్రస్తావిస్తుంటారు. పలు సందర్భాల్లో ఆమెను గుర్తు చేసుకుంటుంటారు. తానీ స్థాయిలో ఉన్నానంటే దానికి  కారణం తన తల్లిదండ్రులేనని ఆలీ చెప్పటం మర్చిపోలేం.
సమయం చిక్కిన ప్రతిసారీ తన తల్లితో సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపించే ఆలీ.. తన తండ్రిపేరుతో ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.