ఇంగ్లిష్లో మీరు తప్పుగా పలికే ఫుడ్ నేమ్స్ ఇవే

August 03, 2020

ఇంగిలీషు భాష ఎంతో తమాషా

సాల్ట్ అంటే ఉప్పు

ఫాల్ట్ అంటే తప్పు

క్రో అంటే కాకి

కాక్ అంటే పుంజు

గుడ్ అంటే గుడ్డు కాదు

బెడ్ అంటే బెడ్డు కాదు

నాట్ అంటే కాదు కాని బట్ ఐతే వాట్ ఏమి? 

అంటూ మా చిన్నప్పటి మాస్టారు క్లాసులు బోరు కొట్టినపుడు తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్ కలిపి భలే సరదాగా చెప్పేవారు. ఇపుడు అలాంటి స్టోరీ టెల్లర్ మాస్టార్లు కరవయ్యారు. సరే ఆ ముచ్చట్లు తర్వాత... మనం ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ఇంగ్లీష్ భాష లేకుండా ముందుకు పోలేం. ఇంగ్లీష్ మహా సముద్రంలో భాష నేర్చుకోవడం ఒకెత్తు అయితే.. దానిని పలకడం మరొకెత్తు. కొందరికి ఎంత ఇంగ్లిష్ గ్రామర్, వర్డ్ పవర్ వచ్చినా... పలకడంలో బోల్తా పడుతున్నారు. కొందరేమో సార్వజనికంగా కొన్ని పదాలను తప్పుగా పలకడానికి అలవాటు పడి ఉంటారు. మరి అవన్నీ చెప్పుకోలేం. అందుకని... కచ్చితంగా మనం తప్పుగా పలికే కొన్ని పదాలను చూద్దాం. వాటిని ఇక తప్పుగా పలకకుండా సరిదిద్దుకుందాం.