లిక్కర్ షాపులు: ఆ ఎమ్మెల్యే లాజిక్ విన్నారా?

June 06, 2020

ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య సంచలనంగా మారటమే కాదు.. విన్నవారంతా తిట్టిపోస్తున్నారు. ఇలాంటోడు ప్రజాప్రతినిధిగా ఉండటమా? అని శాపనార్థాలు పెడుతున్నారు. కరోనా వేళ.. ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భంలో.. అందుకు భిన్నంగా బాధ్యత లేకుండా మాట్లాడిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది.రాజస్థాన్ కు చెందినకాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ పుర్ మనసుకు కొత్త ఆలోచన వచ్చింది. కరోనాను కట్టడి చేసేందుకు చేతులకు అల్కాహాల్ తో కూడిన శానిటైజర్లను తరచూ వినియోగించాలని చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇదే విషయానికి ఆయన తన పైత్యాన్ని కాస్తంత జోడించారు. ఆల్కాహాల్ తో చేతులు తుడుచుకుంటేనే వైరస్ చచ్చిపోతున్నప్పుడు.. గొంతులో పోసుకొని తాగితే.. ఇంట్లో వైరస్ చచ్చిపోతుందన్న లాజిక్ ను తెర మీదకు తీసుకొచ్చాడు. తనకొచ్చిన ఐడియాను చెప్పటమే కాదు.. దాన్ని లేఖ రూపంలో రాజస్థాన్ ముఖ్యమంత్రికి పంపటం సంచలనంగా మరాింది.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం కొనుగోళ్లు.. అమ్మకాలు సాగుతున్నాయని.. మద్యం దుకాణాల్ని మూసేయటంతో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. అందుకే.. లిక్కర్ షాపుల్ని తెరిపించాల్సిందిగా డిమాండ్చేస్తున్నారు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో చేతుల్ని రుద్దుకుంటే వైరస్ నాశనమవుతుందన్నది నిజమే కానీ.. లిక్కర్ తాగితో ఒంట్లో ఉన్న వైరస్ చనిపోతుందన్నది సరికాదు. కానీ.. తనకున్న పరిమితమైన ఆలోచనలతో ఇలాంటి వ్యాఖ్య ఒక ఎమ్మెల్యే నోటి నుంచి రావటం షాకింగ్ గా మారింది. ఇలాంటి దరిద్రపుగొట్టు లాజిక్కులు.. కొందరిపై ప్రభావం చూపుతుందని.. దీంతో లేనిపోని సమస్యలు తప్పవంటున్నారు.