సంచలనం - కాంగ్రెస్ గాంధీ కుటుంబం చేజారుతోంది

July 08, 2020

ఐదేళ్ల తర్వాత కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ అస్సలు పుంజుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ డోలయామానంలో పడింది. ఇక తాను కొనసాగితే పార్టీయే లేకుండా పోతుందని భావించిన అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నిర్ణయంపై చాలామంది రాహుల్ ను వారించారు. తల్లికీ ఇష్టం లేదు. అయినా రాహుల్ గాంధీ తన నిర్ణయంపై కఠినంగా ఉన్నారు. ఇక చేసేది లేక పార్టీకి కొత్త నాయకత్వాన్ని వెదికారు సోనియాగాంధీ.

లోక్‌ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత 2024 నాటికి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం తెచ్చే దిశగా మార్గదర్శనం చేసే నాయకుడి కోసం వేట మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కనిపించారు. ఈయన వయసు 68 సంవత్సరాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, లాయల్టీ ఉన్న నేత అయిన అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని కోర్ కమిటీ భావిస్తోంది. ఈ పేరును ఖరారుచేశారని అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. కాంగ్రెస్ మీద వారసత్వ పార్టీ అని బలమైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు కూడా అడ్డుకట్ట వేయాలని పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
అశోక్ గెహ్లాట్ ఇప్పటికే రెండు సార్లు సీఎంగా చేశారు. ఇపుడు అతను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయితే సీఎం పదవిని సచిన్‌ పైలట్‌ కు ఇవ్వాలని సోనియా భావిస్తున్నారట.