అమ్మేవాడు మోసం చేస్తే ఇక సీన్ సితారే

August 10, 2020
CTYPE html>
ఇండియాలోని గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో కూల్ డ్రింక్ కొట్టే 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు? అదేంటండీ అంటే కూలింగ్ ఫీజట. బాప్ రే. ఒక ఫ్రిజ్ నెలంతా 24 గంటలు వాడితే వచ్చే బిల్లు 100. కానీ ప్రతి బాటిల్ కు 2 రూపాయలు తీసుకుంటారు. ఇది ఒక ఉదాహరణ. పాపం వీరిని క్షమించవచ్చు. చిన్న వ్యాపారులు. రోజూ కూలీ అంత రాదు పాపం వీరి ఆదాయం. 
రియల్ ఎస్టేట్ మోసాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల మోసాలు, ఇతర అనేక వస్తుసేవల మోసాలతో జనం విసిగిపోయారు. అమ్మేటపుడు ఒకమాట, సమస్య వస్తే ఇంకో మాట చెబుతారు. దీంతో చాలామంది సమయం లేక, గొడవ ఇష్టం లేక, చేతకాక మౌనంగా ఉంటారు. కొన్నిసార్లు షాపులో అమ్మింది తీసుకోవడం, ఎలా ఉన్నా సర్దుకుపోవడం... కొన్నిసార్లు మాత్రం రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంతకు మించి పట్టించుకోరు. 
 
నిజానికి వినియోగదారులకు చాలా హక్కులుంటాయి. బలమైన చట్టాలున్నాయి. కన్జూమర్ ఫోరంలో రిలయన్స్ వంటి పెద్ద సంస్థ నుంచి అయినా మనం నష్టపరిహారం రాబట్టొచ్చు. తాజాగా కేంద్రం ప్రస్తుత వినియోగదారుల భద్రత చట్టం కంటే మరిన్ని హక్కులతో, కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై ఏ వస్తువుకు పరిహారం పొందే అవకాశం కల్పించారు. ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే ఉత్పత్తుల విషయంలో నిబందనలు మరింత కఠినతరం చేశారు. 
వినియోగదారుడికి భద్రతకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 
ఇక నుంచి కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలా పడితే అలా తమ ఉత్పత్తులను అమ్మడానికి కుదరదు. ఇకపై పరిమాణం, సామర్థ్యం, స్వచ్ఛత, ప్రమాణాలు, ధర అనే ఐదు అంశాలపై కచ్చితమైన సమాచారం ఉత్పత్తిపై ఉండాలి. ఒకే ఉత్పత్తికి ఇతర పోటీదారులు ఆఫర్ చేస్తున్న ధరలను తప్పక తెలియజేయాలి. నకిలీ, నిషేధిత ఉత్పత్తులను అమ్మితే పరిహారం కట్టకతప్పదు.
ఇక కల్తీపై కూడా ఈ చట్టం విశ్వరూపం చూపిస్తోంది. లక్ష వరకు పరిహారం పొందవచ్చు. లేదా వ్యాపారులకు 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
తప్పుడు ప్రకటనలు చేస్తే రూ.5 లక్షల నుంచి 10 లక్షల దాకా జరిమానా,  ఐదేళ్ల జైలు శిక్ష ఉంటాయి. ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం జైలు శిక్షలు తప్పవు.