కేసీఆర్ కు తన తడాఖా చూపించింది

August 03, 2020

నేనంటే నీకు లెక్క లేదా... నా తడాఖా ఏందో చూస్తావా అన్నట్టు తెలంగాణలో విజృంభించింది కరోనా వైరస్. టెస్టులు చేయకుండా, హైకోర్టు తీర్పులను పట్టించుకోకుండా నచ్చినట్టు ముందుకు వెళ్తున్న కేసీఆర్ సర్కారు గత రెండు వారాలుగా కరోనాపై ఉన్నత స్థాయిలో దృష్టిపెట్టడం మానేసింది.

ఒక జర్నలిస్టు పదహారు గంటల పాటు చికిత్స కోసం వేడుకుని చనిపోయాడని స్వయంగా ఆయన సోదరుడు వీడియో విడుదల చేశాడు. అది తప్పు అని కూడా గవర్నమెంటు ఖండించలేకపోయింది. ఎందుకంటే ఆ జర్నలిస్టు వాట్సప్ మెసేజులు ఇంకో మిత్రుడి వద్ద ఉన్నాయి. మరోవైపు గాంధీ లో డాక్టర్ల ధర్నా. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 

తాజాగా గురువారం రాత్రి విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రమాదకరమైన స్థాయిలో తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం, ప్రజలు ఒకరికి మించి ఒకరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కేసులు పెరగడమే కాదు... అది విస్తరిస్తున్న తీరు ఘోరంగా ఉంది.

గురువారం రాత్రికి 

కొత్త కేసులు 208

( GHMC 175 + Rural 33)

మొత్తం కేసులు తెలంగాణలో నిన్న సాయంత్రానికి 4320 కి చేరుకున్నాయి. 

ఇక తాజా సంచలనాలు ఏంటంటే... 

బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో 9 మందికి కరోనా సోకింది.

మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవరుకి కరోనా సోకింది.

రైల్వే భవన్లో ఒక అధికారికి కరోనా సోకింది

ఎల్బీ నగర్ లో ఒకే అపార్టుమెంటులో 11 మందికి కరోనా సోకింది.

నిన్న ఒక్క రోజే 9 మరణాలు సంభవించాయి.

ఇవి ప్రభుత్వానికి తెలిసినవి. ఇంకా ప్రభుత్వానికి తెలియనివి, ప్రజలకు తెలియనివి చాలా ఉన్నాయి.