ఏపీలో పగులుతున్న కరోనా పుట్ట  !

June 05, 2020

తబ్లిగి ఏపీ కొంప ముంచేసింది. అతి తక్కువ కేసులతో ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ముస్లింలు నిర్వహించిన తబ్లిగి జమాత్ మీటింగే. వాస్తవానికి ఈ సమావేశం ఏర్పాటుచేయడం అసలు సమస్య కాదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, దొంగ వీసాలతో అనేక దేశాల నుంచి దొడ్డిదారిలో ముస్లింలు అది కూడా కరోనా రోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. WHO ఈ సమావేశానికి ముందే అంతర్జాతీయ ఎమర్జెన్సీ పాటించి సామాజిక దూరం పాటించాలని చెప్పినా కూడా ఈ సమావేశంలో ఒకే ప్లేట్లో కడగకుండా 30 దాకా తిన్నారట. టాయిలెట్లు కూడా వేలాది మంది ఇంత గ్యాప్ కూడా లేకుండా వినియోగించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా తెలిసి చేసిన తప్పు. దీంతో ఇతర దేశాల కరోనా రోగులు అందరికీ అంటించేశారు. 

ఈ తబ్లిగి తెచ్చిన వైరస్ కి దేశంలో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఒక్కసారిగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. నాలుగు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. రాత్రి నుంచి ఉదయానికి 34 కేసులు పెరిగాయి. మొత్తం 226 కేసులు నమోదయ్యాయి ఇప్పటికి. ఇంతవరకు కర్నూలులో చాలా తక్కువ కేసులు ఉండేవి. రాత్రి నుంచి ఆ జిల్లాలో 23 జిల్లాలు బయటపడ్డాయి. కర్నూల్లో కేసుల సంఖ్య 27కి పెరిగింది. నెల్లూరు, గుంటూరుల్లో వరుసగా 34, 30 కేసులు నమోదయ్యాయి. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మాత్రం జీరో కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లా అనంతపురం.  

Read Also

శుక్రవారం 75 కేసులు... కేసీఆర్ సంచలన నిర్ణయం !!
పబ్లిసిటీ పిచ్చితో చట్టం ఉల్లంఘించిన ఏపీ
బాలయ్య విరాళం గురించి చిరంజీవి కామెంట్స్