తెలంగాణలో ఆ ఊరికి వెళ్లకండి

April 06, 2020

అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో ఇండియన్స్ టాప్. అందునా మన తెలుగువారి సంగతి చెప్పనక్కర్లేదు. కొత్త గూడెం డీఎస్పీ కొడుకు నాలుగు రోపుల క్రితం లండన్ నుంచి వచ్చారు. అతనికి క్వారంటైన్ లో ఉండమని చెబితే... డీఎస్పీ తన అధికారాన్ని వాడి కొడుకును నేరుగా ఇంటికి తీసుకువచ్చారు. పోనీ ఇంట్లో అయినా ఐసోలేట్ గా ఉంచకుండా ఫంక్షన్లకు, స్నేహితుల ఇళ్లకు తిప్పాడు. దీంతో కొత్తగూడెం మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించింది ప్రభుత్వం. అంటే ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది.

ఇపుడు కొడుకు, తండ్రి, వారి పనిమనిషికి కరోనా ఖరారైంది. వీరు కలిసిన మరో 22 మందికి ప్రస్తుతం గాంధీలో పరీక్షలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి ఉందో ఎవరు ఎంత మందికి అంటించారో అంతుచిక్కని విధంగా ఉంది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కొత్తూగెడం ను రెడ్ జోన్ గా ప్రకటించారు. టౌను మొత్తం కెమికల్ చల్లారు. ఇళ్ల నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేలు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also

వాళ్ల పాస్ పోర్టు రద్దు చేస్తాం... కేసీఆర్ వార్నింగ్
కేసీఆర్ సంచలన నిర్ణయం.. కాల్చేద్దామా?
తెలంగాణలో మరో 3 కేసులు.. లక్ ఏంటంటే..