ఆ పని చేయకపోతే ఏపీ మటాష్

June 01, 2020

జగన్ ప్రభుత్వానికి నిరంతం రెండే రెండు ఆలోచనలు

  1. ప్రతిపక్ష నాయకుడిని జనం మనసుల్లో నుంచి తీసెయ్యడం ఎలా?
  2. ఏ రెడ్డికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది.

కానీ ఈయన ఈ రెండు పనుల్లో బిజీగా ఉంటే ఏపీ ప్రమాదపుటంచులకు చేరుకుంది. 12 గంటల్లో 43 కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే. చివరకు బీహార్ లో కూడా ఏపీ కంటే ఎక్కువ మందికి టెస్టులు చేశారు. ఒక వైపు ఏపీలో 1000 మందికి పైగా డిల్లీ తబ్లిగి సభకు వెళ్లొచ్చినట్టు చెబుతుంటారు. తక్షణం వారందరికీ టెస్టులు చేయాల్సింది పోయి... ప్రతిపక్షాల మీద ట్వీట్లు వేసుకుంటూ ఉన్నారు ఏపీ నాయకులు. 

1000 మంది ఢిల్లీ వెళ్లొస్తే... వారు కచ్చితంగా ఒక్కొక్కరు 10-15 మందిని కలిసుండే అవకాశం ఉంది. అంటే 15 వేల మందికి వెంటనే టెస్టులు చేస్తే గాని ఏపీలో కరోనాని ఆపే అవకాశం లేదు. ఈ పని యుద్ధ ప్రాతిపదికన చేయకపోతే వారు ఇతరులకు వారికి కూడా తెలియకుండా వ్యాప్తి చేస్తారు. కనీసం వారందరినీ క్వారంటైన్ కి అయినా తరలించారు. 

అయితే, ప్రభుత్వం కేవలం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి మీదే దృష్టిపెడుతోంది గాని వారొచ్చాక ఇక్కడ ఎవరిని కలిసింది, వారు ఇంకెవరును కలిసింది అనే చైన్ ను మాత్రం ట్రేస్ చేయడం లేదు. ఇది అత్యంత వేగంగా చేయాలి. అంతేకాదు.. వీరి కుటుంబాలు ఏవైనా వ్యాపారాలు చేస్తుంటే వాటిని తాత్కాలికంగా ఆపేయాలి. ఈ పనులు అన్నీ వేగంగా చేయకపోతే ఏపీని కరోనా మహమ్మారి చుట్టుముట్టేస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఈ విషయం ప్రభుత్వం వెంటనే తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఘోరాలు జరుగుతాయి. 

తెలంగాణ ముస్లింలు భాషా విభేదం వల్ల ఇతరులతో అంత వేగంగా కలవరు. కానీ ఏపీలో అలా కాదు.. అక్కడ ముస్లింలు అన్ని మతాల్లో సలువుగా కలిసి పోతారు. కడప వంటి కొన్ని చోట్ల తప్ప ఏపీలో అందరితో కలిసే ఉంటారు. కాబట్టి కమ్యూనిటీ స్ప్రెడ్ ఏపీలో వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. వెంటనే ఈ చైన్ బ్రేక్ చేయడానికి ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఏపీని రక్షించాలి.

మరోవైపు నిత్యావసర సరుకుల కోసం ప్రజల సామాజిక దూరం పాటించకుండా కలిసిపోతున్నారు. అతుక్కుని లైన్లలో నిలబడుతున్నారు. విశాఖపట్నంలో అయితే ఏకంగా మహిళలు గొడవలు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఈ రెండు పనులు కూడా వెంటనే చేయకపోతే ఇక ఏపీని ఎవరూ కాపాడలేరు.