దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ జోన్ల లెక్క తేల్చేశారు

August 08, 2020

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్. కోట్లాది మంది ఇళ్లకే పరిమితమైనప్పటికి అనుకున్న దాని కంటే ఎక్కువగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారితో కరోనా వైరస్ దేశంలోకి వచ్చినా.. దాన్ని కంట్రోల్ చేసే విషయంలో కేంద్ర.. రాష్ట్రాలు కొంతమేర సక్సెస్ అయ్యాయి. అనుకోని రీతిలో మర్కజ్ ఎపిసోడ్ తో పరిస్థితి మొత్తం మారిపోయింది. దీంతో.. సదస్సుకు వచ్చిన వారు.. వారితో కాంటాక్టు అయిన వారిని గుర్తించే పనిలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలైపోయారు. ఇప్పటివరకూ వారిని గుర్తించే పనిలోనే ఉన్నారు.
తాజాగా ఆ లెక్కను ఒక కొలిక్కి తెచ్చిన కేంద్రం.. దేశ వ్యాప్తంగా కరోనాకు డేంజర్ జోన్లుగా 96 జిల్లాల్ని గుర్తించింది. ఈ జిల్లాల్లో కరోనా పాజిటివ్ లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని హాట్ స్పాట్లుగా గుర్తించి.. అక్కడ ఫోకస్ పెట్టటం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ.. కరోనా పాజిటివ్ రోగులు ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లే అవకాశం లేదు. దీంతో.. వారిని గుర్తించటం తేలికైంది.
అలా గుర్తించిన వారిలో కరోనాపాజిటివ్ ఎంతమందికి? పాజిటివ్ వచ్చినోళ్లు ఎంతమందిని కాంటాక్టు అయ్యారు? అలాంటి వారిని గుర్తించి పరీక్షలు జరిపి వారిలో పాజిటివ్ ఎంత? అలా పాజిటివ్ తేలిన వారు మరెంతమందిని కాంటాక్టు చేశారన్న గొలుసు పద్దతిలో ఆరా తీసుకుంటూ పోవటం ద్వారా.. కరోనా గొలుసును కట్ చేయొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెయిన్ నుబ్రేక్ చేయటం సులువని.. మరింత ఆలస్యమైతే.. చేయి దాటిపోతుందని చెబుతున్నారు. అందుకే.. లాక్ డౌన్ పొడిగింపు దిశగా కూడా ఆలోచనలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. దేశంలో ప్రమాదకరమైన జిల్లాలుగా ప్రకటించిన వాటి విషయంలోకి వెళితే.. ఆయా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో పాటు.. అధికార యంత్రాంగం మొత్తాన్ని దింపటం ద్వారా.. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా గుర్తించిన రెడ్ జిల్లాల్ని చూస్తే..


అండమాన్‌ , నికోబార్‌ దీవులు
ఉత్తర, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్‌
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు
తెలంగాణ
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి
తమిళనాడు
చెన్నై, తిరునల్వేలి, ఈరోడ్, నమక్కల్, కోయంబత్తూర్, కన్యాకుమారి
కర్ణాటక
బెంగళూరు అర్బన్, చిక్‌బళ్లాపూర్, ఉత్తర కన్నడ, మైసూరు
కేరళ
కసర్‌గఢ్, ఎర్నాకులం, కన్నూర్, పాత్తనమిట్ట, కోజికోడ్, మల్లాప్పురం, తిరువనంతపురం
మహారాష్ట్ర
ముంబై, పుణే, నాగ్‌పూర్, సాంగ్లీ, థానే, అహ్మద్‌నగర్, పాలఘర్‌
మధ్యప్రదేశ్
ఇండోర్, జబల్‌పూర్, ఉజ్జయిని, భోపాల్‌
బిహార్
పట్నా, ముంగేర్, బేగుసరాయ్, లక్కిసరాయ్, నలందా
ఛత్తీస్ గఢ్
చండీగఢ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్‌
రాజస్తాన్‌
జైపూర్, జోధ్‌పూర్, ఝంఝూ
ఉత్తర్‌ప్రదేశ్‌
మీరట్, ఆగ్రా, గౌతం బుద్ధనగర్, లక్నో, గజియాబాద్‌
ఉత్తరాఖండ్‌
డెహ్రాడూన్‌
పశ్చిమబెంగాల్‌
కోల్‌కతా, 24 పరగణాల ఉత్తర, హూగ్లీ, మిడ్నాపూర్‌ ఈస్ట్, నడియా
ఢిల్లీ
సౌత్, సౌత్‌వెస్ట్, ఈస్ట్, వెస్ట్, నార్త్‌వెస్ట్, నార్త్‌ ఈస్ట్, నార్త్, నార్త్‌ ఢిల్లీ, సెంట్రల్, సహదరా, సౌత్‌ ఈస్ట్‌
గోవా
దక్షిణ గోవా, ఉత్తర గోవా
గుజరాత్
అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోద, రాజ్‌కోట్, భావ్‌నగర్, బోతాడ్, గిర్‌ సోమ్‌నాథ్, కఛ్, మహేసన, పోర్‌బందర్‌
హర్యానా
గుర్గావ్, ఫరీదాబాద్, అంబాలా
జమ్ము, కశ్మీర్‌
శ్రీనగర్, బాందిపొర
లఢక్
లేహ్‌ లఢక్‌
పంజాబ్
షాహిది భగత్‌సింగ్‌ నగర్, ఎస్ఏఎస్‌ నగర్, బిల్వారా