అమెరికాలో ఈ ఘోరానికి కారణం చెప్పిన న్యూయార్క్ టైమ్స్ !!

August 12, 2020

అమెరికా వ్యాపారంలోనే కాదు.... కరోనాలోనూ తన స్థానం నిలబెట్టుకుని అగ్రరాజ్యంగా నిలబడింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. ప్రస్తుతం ఆ దేశంలో కోవిడ్ కేసులు 3 లక్షలు దాటిపోగా... మరణాల సంఖ్య 8100 దాటింది. ఎందుకింత విలయం అంటే చాలామంది ట్రంప్ ని వేలెత్తి చూపుతారు. నిజమే ... అయితే ట్రంప్ ఏం చేశాడు అనే విషయాన్ని అమెరికన్ పత్రిక అయిన న్యూయార్క్ టైమ్స్ నేడు వివరిస్తు ఒక పెద్ద స్టోరీ రాసింది. 

చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్నపుడు అమెరికాలో ఎటువంటి ప్రయాణ ఆంక్షలు అమెరికా విధించలేదట.  వుహాన్ లో మారణహోం జరుగుతున్నా కూడా అక్కడి నుంచి విమానాలు అమెరికా రద్దు చేయలేదట. చైనా తనంతట తాను ఆపేసింది గాని మొదటి రెండు వారాలు అమెరికా పట్టించుకోలేదు. ఆ తర్వాత రెండు వారాలు కూడా కేవలం వుహాన్ నుంచి వచ్చిన వారినే స్క్రీన్ చేసింది. అయితే... రెండు మూడు వారాల్లోనే అమెరికాలో 4.3 లక్షల మంది కేవలం చైనా నుంచే వచ్చారట. వీరందరు చైనీయులు కాదు... కానీ చైనా నుంచి అమెరికా వచ్చిన అనేకమంది విదేశీయులు. వీరి ద్వారా అమెరికాలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

మొదట్లో అటు నుంచి వచ్చిన వారిలోనే కనిపించింది. రెండో దశ దాటేప్పటికి అమెరికాలో మార్చి వచ్చింది. అప్పటికే అమెరికాలో గుర్తించలేనంత మంది దేశ వ్యాప్తంగా విస్తరించి పోయారు. ఇపుడు నివారణ చేసే పరిస్థితి ఏం లేదు. కేవలం టెస్టు చేసి చికిత్స చేయడమో, శృతి మించితే శవాగారానికి పంపడం తప్ప అమెరికా చేతుల్లో ఏం లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

చైనా వుహాన్ ని మూసేసినపుడే అమెరికాలో ఆంక్షలు కఠినతరం చేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా తీవ్రతను అసలు గుర్తించడానికి నిరాకరించడం వల్ల ఈ ఘోరం జరిగిపోయిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.