శృంగారంతో కరోనా వ్యాపిస్తుందా?

August 12, 2020

వణికిస్తున్న వైరస్ వేళ.. బోలెడన్ని సందేహాలు. అయితే.. మామూలుగా వచ్చే డౌట్లను తీర్చుకోవటానికి బోలెడన్ని మార్గాలు ఉంటాయి. కానీ.. మనసుకు వచ్చే కొన్ని సందేహాల్ని మాత్రం ఇట్టే బయటపెట్టలేని ఇబ్బందిని కొందరు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ కోవలోకే వస్తుంది.. కరోనా వేళ సెక్సు చేస్తే ఏమైనా సమస్యా? అన్నది.
దీనిపై అమెరికా.. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు పలువురు పరిశోధనలు చేశారు. వారి లెక్క ప్రకారం సెక్సుతో కొవిడ్ 19 వ్యాప్తి చెందదని చెబుతున్నారు. పురుషల వీర్యంలో వైరస్ ఉన్నట్లుగా ఆధారాలు లేవని తేల్చారు. ఎబోలా.. జికా.. సార్స్.. కొవిడ్ 19తోపాటు కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్ .. సెక్సు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీంతో.. ఈ అంశంపై పరిశోధనల్ని జరిపారు. ఇందులో భాగంగా చైనాకు చెందిన 34 మంది రోగుల వీర్యం నమూనాల్ని సేకరించారు. వాటిని పరీక్షలు జరిపినప్పుడు అందులో వైరస్ జాడలు కనిపించకపోవటాన్ని గుర్తించారు. అయితే.. ఇదంతా ప్రాథమిక స్థాయిలో సాగిన అధ్యయనమని.. మరింత లోతుగా పరిశోధన సాగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే.. కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.