కరోనా వేళ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

August 09, 2020

కలకలం రేపుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనాన వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా.. సుప్రీంకోర్టులో అత్యవసర కేసుల విచారణ మాత్రమే జరపనున్నారు. ఈ కారణంగా కోర్టుకు రావాల్సిన వారితో పాటు..పని చేయాల్సిన సిబ్బందికి సంబంధించి అన్ని పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టులోకి అనుమతించనున్నారు.
ఈ సోమవారం నుంచి సుప్రీంకోర్టులోని ఆరు ధర్మాసనాలు మాత్రమే విధులు నిర్వర్తిస్తాయి. ఒక్కో ధర్మాసనం గరిష్ఠంగా 12 అత్యవసర కేసుల్ని మాత్రమే విచారించనున్నారు.  కరోనా వేళ.. సుప్రీంకోర్టులో రద్దీని తగ్గించేందుకు వీలుగా అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేసుల్ని వాదించే లాయర్లతో పాటు.. విధులు నిర్వహించాల్సిన సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టుల్ని నిర్వహిస్తారు. వీరు మినహా మిగిలిన వారిని సుప్రీంకోర్టు ఆవరణలోకి అనుమతించరు.
సుప్రీంకోర్టు విచారించనున్న ఉదంతాల్లో నిర్బయ దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ మీదా విచారణను నిర్వహిస్తారు. తన తరఫు న్యాయవాది కోర్టును తప్పుదారి పట్టించారని.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయటంతో దీనికి సంబంధించిన విచారణను సోమవారం చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే.. కరోనా వేళ సుప్రీంకోర్టు 72 కేసుల్ని మాత్రమే విచారించనుంది.