తమిళనాడు కన్నీరు మున్నీరు !

August 07, 2020

కేవలం 10-20 కేసులతో తమిళనాడు కూడా ఏపీలాగే ప్రశాంతంగా ఉండింది. తబ్లిగి తమిళనాడు కొంప ముంచింది. రాష్ట్రంపై తబ్లిగి జమాత్ కరోనా విషం చిమ్మింది. దీంతో తమిళనాడు విలపిస్తోంది. భయంతో కంపించిపోతోంది. తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తబ్లిగి జమాత్ కు వెళ్లి ముస్లింలు కరోనాను మోసుకొచ్చి రాష్ట్రానికి అంటించారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే... తమిళనాడు నుంచి ఢిల్లీకి 1130 మంది వెళ్లగా, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 515 మందినే గుర్తించగలిగింది.  మిగతా వారు దురుద్దేశాలతో తప్పించుకుని తిరుగుతున్నారు. వారిని గుర్తించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా... తాజాగా తమిళనాడులో కేసుల సంఖ్య 485కి చేరింది. వీటిలో 437 కేసులు అంటే 90 శాతం కేసులు తబ్లిగి అంటించినవే. ఇంకా బయటపడనివి ఎన్నున్నాయో, ఆ తప్పించుకు తిరుగుతున్న వారు ఎంత మందికి ఎక్కడ కరోనాను అంటిస్తారో అని తమిళనాడు జనం భయంతో చస్తున్నారు. నిత్యావసరాలకు కూడా ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులోని తూత్తుకుడి, తిరునెవేలి, శివగంగ, మధురై, కోయంబత్తూరు, తేని, దిండిగుల్ జిల్లాలలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.    

 ​పరిస్థితి విషమించకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అని చెప్పారు ముఖ్యమంత్రి పళనిస్వామి. కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని​, త్వరలో మరో 2 వేలు అదనంగా అందుబాటులోకి వస్తాయని​ తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్​ వెల్లడించారు. తమిళనాడులో మొత్తం 17 ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4248 మందికి కరోనా టెస్టులు చేయగా.. 485 మందికి సోకినట్టు అధికారికంగా ప్రభుత్వం వెల్లడంచింది.