న్యూయార్క్ కష్టాలు వింటే కన్నీరే

June 06, 2020

ప్రపంచానికే కింగ్ లా వెలిగిన నగరం

ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగలిగిన నగరం

ప్రపంచంలో నిద్రపోని నగరం

న్యూయార్క్. కానీ అది ఇపుడు కరోనాతో విలవిలలాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న నగరంగా న్యూయార్క్ నిలుస్తోంది. వ్యాపార రాజధానిగా వెలుగొందిన నగరం ఇపుడు శవాల గుట్టలతో నిండిపోతోంది. కేవలం నెల రోజుల్లో 1500 మంది మరణించారు. 50 వేల కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలోనే కాదు, న్యూయార్క్ శ్మశాన వాటికలోను వెయిటింగ్ ఉన్న ఘోరమైన పరిస్థితి. చివరకు అతిపెద్ద పార్క్ గా పేరొందిన సెంట్రల్ పార్క్ ఆస్పత్రిగా మారిపోయింది. శవాలు ఖననం చేయడానికి కూడా అవకాశం లేని దుర్భరపరిస్థితి. 

ప్రస్తుతం న్యూయార్క్ మొత్తం మీద 11 వేల మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాస్త వయో వృద్ధులకు కరోనా సోకితే ఆస్పత్రికి పంపేటపుడే చివరి చూపుగా భావిస్తున్నారు. ఎందుకంటే మళ్లీ వారు తిరిగి వస్తారో లేదో తెలియదు. మరణిస్తే మృతదేహం కూడా ఇవ్వరు. ప్రభుత్వమే ట్రక్స్ లో తీసుకెళ్లి ఖననం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి కష్టాన్ని న్యూయార్క్ నగరం ఎన్నడూ చూడలేదు. ఈ మహానగరానికి చరిత్రలో ఏ నాడూ ఇలాంటి దుస్థితి దాపురించలేదు.