సర్ ప్రైజ్: కరోనా తర్వాత ఆటోలను ఇలా మారుస్తారా? 

August 12, 2020

సత్యవన్ గీతే. ముంబైలో ఒక ఆటోవాలా. కానీ కరోనా తర్వాత ఆటోలు ఎలా ఉంటే  బాగుంటుందో సరిగ్గా అలేగా డిజైన్ చేశారు సత్యవన్. అయితే... కరోనా గురించి తెలియక ముందే అతను ఈ ఆటోను తయారుచేసుకోవడం విశేషం. ఆటోలో  హ్యాండ్ వాష్ కోసం ఒక వాష్ బేసిన్, వాటర్, టిష్యూ పేపర్స్... డ్రింకింగ్ వాటర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, చల్లదనం కోసం ఒక ఫ్యాన్... పీసీ సిస్టమ్ కూడా ఉంటుంది. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఎపుడైనా అర్జెంట్ అనుకుంటే అందులో వాడుకోవచ్చు. ఆటోలోనే చిన్నచిన్న నేచురల్ మొక్కలు పెంచుతున్నాడు. చిన్న స్పేస్ లో ఆటోను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు సత్యవన్. దీనిని సత్యవన్ ఎలా ప్రమోట్ చేస్తున్నాడో తెలుసా... ముంబైలో మొట్టమొదటి హోమ్ సిస్టమ్ ఆటో అని రాసుకున్నాడు. 

ఇపుడు అతను మైంబలో చాలా ఫేమస్. జాతీయ మీడియా అంతా అతని గురించి వేనోళ్ల పొగిడింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా భార్యతో కలిసి ఆటోను సందర్శించి సత్యవన్ ని అభినందించారు. ఇదంతా అతను 2019లోనే చేశాడు. సరిగ్గా కరోనా అనంతరం ఆటోలు ఎలా ఉండాలో అలా ఉందీ ఆటో. వాస్తవానికి ప్రయాణికులను ఆకర్షించడానికి అతను ఎంచుకున్న ఈ మార్గం కరోనా అనంతరం అందరికి రోల్ మోడల్ అయ్యింది. హ్యాండ్ వాష్ ఉండటం వల్ల ప్రయాణికులంతా చేతులు కడుక్కుని ఆటో ఎక్కితే వారి ద్వారా ఇంకొకరికి కరోనా సోకకుండా ఉంటుంది. టిష్యూలు అందుబాటులో ఉండటం వల్ల మాస్క్ లేకపోయినా వాటిని వాడుకోవచ్చు. ఇలా ఏ విధంగా చూసినా కరోనా నివారణకు ఈ ఆటో బెస్ట్ మోడల్.