ఏపీలో జరిగిన ఈ అరాచకం తెలుసా??

August 03, 2020
CTYPE html>
చాలామందిని ఒక పెద్ద ప్రశ్న వేధిస్తోంది. టెస్టులు సరిగా చేయని తెలంగాణ కంటే... టెస్టులు లక్షలు లక్షలు చేస్తున్న ఏపీలో కరోనా ఎందుకు కంట్రోల్ కావడం లేదు అని. అయితే... ఇటీవల ఈ ప్రశ్నకు సమాధానాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. కొన్ని నిజాలు వింటే భయమేస్తోంది.
 
కరోనా వ్యాప్తి తగ్గాలంటే టెస్టు చేస్తే సరిపోదు. కేవలం ఉందో లేదో తెలియడానికి ఉపయోగపడుతుంది. మరి ఏం చేయాలి.?
 
1.టెస్టు చేయాలి. టెస్టుకు నమూనాలు తీసుకున్న క్షణం నుంచి ఆ వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేయాలి.
 
2. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలించాలి. ఇంట్లో సదుపాయం ఉండి ఎక్కువ గదులున్న ఇల్లు అయితే హోంక్వారంటైన్లో పెట్టి వారిని పర్యవేక్షించాలి
 
3. పాజిటివ్ అని తేలిన వెంటనే ఆ వ్యక్తిని గత 10 రోజుల్లో కలిసిన వారి వివరాలు సేకరించి వారికి టెస్టులు చేయాలి.
 
4. అందరికీ జనం నుంచి వేరు చేసి చికిత్సలు చేయాలి.
 
మరి ఏపీలో ఏం చేస్తున్నారు?
టెస్టులకు నమూనాలు సేకరిస్తున్నారు. వాటిలో 2 లక్షల శాంపిళ్లు అత్యంత నిర్లక్షంగా వృథా అయ్యాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 35 వేల శాంపిల్స్ వేస్టు చేసినట్లు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకొందరికి టెస్టులు చేసిన 15 రోజుల తర్వాత కూడా ఫలితం రాలేదు.
 
పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స లేదు పర్యవేక్షణ లేదు. దీనికి సంబంధించిన ఒక విచాకరమైన ఘటన ఇపుడు తెలుసుకుంటే అసలు ఏపీలో ఎందుకంత పెరుగుతుందో మీకర్థం అవుతుంది.
 
జగ్గయ్య పేటకు చెందిన వృద్ధురాలికి (65) కరోనా టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆమెను 108లో తీసుకెళ్లి విజయవాడ ఆస్పత్రిలో వదిలేశారు. మంచాలు  ఖాళీ లేవు, ఇంటికి వెళ్లు అన్నారు. ఇది నెంబరు 1 మిస్టేక్. ఆమెను అంబులెన్సులో తెచ్చారు. బెడ్లు లేకపోతే అంబులెన్సులో తిరిగి పంపాలి కదా. ఒంటరిగా ఆమె జగ్గయ్యపేటకు ఎలా వెళ్తుంది?  ఏం జరిగి ఉంటుందో ఊహించండి.
కొడుక్కి ఫోన్ చేసింది. సరేనమ్మా అంటూ అతను ప్రైవేటు వాహనం కోసం ప్రయత్నించారు. కరోనా సోకడంతో ఎవరూ ఆమెను తిరిగి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. మరోవైపు ఆస్పత్రిలో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు, తిండి కూడా పెట్టలేదు. ఏమీ పాలుపోక ఆమె ఆకలితో వరండాలో పడుకుంది. ఉదయాన్ని బస్సులు మొదలయ్యాక బస్టాండుకు వెళ్లి బస్సెక్కి జగ్గయ్య పేట వెళ్లింది. అంటే ఇతరులకు ఆమె వల్ల కరోనా సోకే ప్రమాదం వంద శాతం ఉంది. 
ఎమ్మారో ఏమన్నాడు - ఆమెను తరలించిన విషయం నా దృష్టికి రాలేదు అన్నాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో విచారిస్తాం అన్నాడు
కమిషనర్ ఏమన్నాడు - మంచాలు చూస్తాం, వేచి ఉండమని చెప్పినా ఆమె వెళ్లిపోయిందని వైద్య సిబ్బంది చెప్పారని అన్నాడు. 
 
ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. 
1.
50 ఇళ్లకు ఒక వాలంటీరు ఉండి కరోనా పై డేగ కన్ను వేస్తే ఈ వ్యవహారాన్ని మొత్తం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వలంటీర్ ఏమయ్యాడు. అతనితో పాటు ఉండే ఆశ కార్యకర్తలు ఏమయ్యారు. పాజిటివ్ కేసు వస్తే ఎమ్మార్వోకు సమాచారం తెలియకపోవడం ఏంటి. కలెక్టరు ఆఫీసు నుంచి పాజిటివ్ కేసు సమాచారం పేరెంట్ కి ఇచ్చినపుడు ఆటోమేటిగ్గా ఎమ్మార్వో, వీఆర్వో, వలంటీర్, పోలీస్, ఆశ కార్యకర్తలు వీరందరికి తెలియాలి అధికారికంగా తెలియాలి. ఎందుకు తెలియడం లేదు?
2. 
ముసలావిడ రాత్రంతా ఆస్పత్రిలో ఉండి పొద్దున వెళ్తే ఉండమని చెప్పినా వెళ్లిపోయిందని ఎలా ఉంటారు సిబ్బంది, దానిని కమిషనర్ ఎలా నమ్ముతారు? ఆమెకు బెడ్ ఇవ్వకుండా, తిండిపెట్టకుండా ఉంటే ఆమె ఆకలితో చచ్చిపోయినా పర్లేదా. సహాయకులు ఉంటే గవర్నమెంటు ఆస్పత్రి సిబ్బంది పలకడం కష్టం, దాదాపు 18 గంటలు ఆస్పత్రిలోనే పేషెంటు ఉన్నా కూడా నింద ఆమె మీద ఎలా వేస్తారు?
 
ఏపీలో ఏం జరుగుతుందో ఇపుడు అర్థమైందా? టెస్టులు చేస్తున్నా ఎందుకు కంట్రోల్ కావడం లేదో, తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థమైందా.. ఇలా ఉంది ఏపీలో ప్రభుత్వ కోవిడ్ నియంత్రణ తీరు. ఇదిలాగే కొనసాగిస్తే ఎన్నటికీ కోవిడ్ ఏపీలో తగ్గే సమస్యే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జాగ్రత్త పడక తప్పదు.