కరోనా వల్ల కూడా మంచి జరుగుతుందా?

August 14, 2020
CTYPE html>
ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న కొవిడ్‌-19 కమల్‌నాథ్‌పై మాత్రం కనికరం చూపింది. బలపరీక్షకు బ్రేక్‌ ఇచ్చింది. ద్యోతిరాధిత్య సింధియా హ్యాండివ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడిన కమల్‌నాథ్‌ సర్కారు... సోమవారం విశ్వాసపరీక్షను ఎదుర్కోవాలి. ఇది జరిగివుంటే కమల్‌నాథ్‌ కచ్చితంగా బోల్తా పడివుండేవారు. కాంగ్రెస్‌ బలగం సరిపోక సర్కారు కూలిపోయేది. ఇవేమీ జరక్కుండా కరోనా అడ్డుకుంది. వైరస్‌ వ్యాపించకుండా, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26వరకూ వాయిదా పడ్డాయి.
సోమవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే, సినిమా స్ట్రిప్టును తలపించే పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌ లాల్జీ టాండన్‌ సభనుద్దేశించి ప్రసంగించారు. తక్షణమే విశ్వాసపరీక్ష చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకోవద్దంటూ అధికార కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేశారు. విశ్వాస పరీక్ష జరపాల్సిందేనని విపక్ష బీజేపీ సభ్యులు కూడా పోటీగా నినాదాలకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విశ్వాసపరీక్షకు కాసేపు పట్టిబట్టిన గవర్నర్‌, స్పీకర్‌ అందుకు సముఖంగా లేకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేశారు.
అసెంబ్లీ జరిగితే కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశముంది కాబట్టి, సభను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో, విశ్వాసపరీక్ష అప్పటివరకు వాయిదా పడింది. కమల్‌నాథ్‌ సర్కారుకు 10 రోజుల సమయం కలిసివచ్చింది. ఈ గడువులోగా మధ్యప్రదేశ్‌ రాజకీయం ఇంకెంత ఉత్కంఠగా మారుతుందో, ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.