సంచలనం... ఏపీలో కరోనా 3వ దశ ??

June 03, 2020

కరోనా ఇంతవరకు పుట్టిన వైరస్ ల కంటే పది రెండ్లు డెడ్లీ వైరస్ అని ఇటీవలే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పలు పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ఉటంకించాయి. ఈ రోగం మానవుడిలోకి ప్రవేశిస్తే చేసే నష్టం కన్నా... అది వ్యాప్తి చెందకుండా మనం చేయాల్సిన పనుల వల్లే మనం ఎక్కువ నష్టపోయే పరిస్థితి. 

దురదృష్టత్తవశాత్తూ ఏపీలో కరోనా విపరీతంగా ప్రబలుతోంది. విదేశీ, ఢిల్లీ లింకులు లేని కేసులు ప్రతిరోజు ఏపీలో బయటపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా ఏ వస్తువు ద్వారా అయినా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. మనం బతకాలంటే ముఖ్యంగా కూరగాయలు సరుకులు కావాలి కదా. మరి అవి ఇతరులు మనకు ఇవ్వాలి. అంటే వారు ముట్టుకోవాలి. అంతేకాదు వాటిని మనం కొన్న అనంతరం మనం వ్యాపారికి డబ్బులు ఇవ్వాలి. వారు చిల్లర మనకు తిరిగి ఇవ్వాలి. ఇది మాత్రం జరగకమానదు. ఇలా వస్తువులు, నోట్లు చేతులు మారే క్రమంలో కరోనా ఇతరులకు సోకుతోంది. ఇప్పటికే ఏపీలో పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు బయటపడినట్లు స్వయంగా ఏపీ డీజీపీ ప్రకటించారు.

గోదావరి, గుంటూరు, కృష్నా జిల్లాల్లో ఇలాంటి కేసులు ఎక్కువ కనిపిస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఫోన్ పే, జీపే, పేటీఎం వంటి వాడమని చెబుతోంది. కొన్న వస్తువులను కూడా కడగడమో, శానిటైజ్ చేయడమో చేసి వాడుకోవాలని సూచిస్తోంది. నోట్లు తీసుకోవాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తోంది. ఏపీలో వీలైనంత త్వరగా లక్షల సంఖ్యలో టెస్టులు చేయకపోతే పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషుడు అయిన అభిగ్యానంద్ కూడా తన వీడియోలో ఏపీ ఎక్కువగా కరోనాకు ప్రభావితం అవుతుందని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దీనిని బట్టి చూస్తుంటే... ఒక భారీ ముప్పు ఏపీకి పొంచి ఉన్నట్టే అనిపిస్తోంది.

ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ టిప్స్ పాటించండి.

  1. సరుకులు కొన్నాక గుమ్మం బయటే కారిడార్ లో వీలైనన్ని ఎక్కువ గంటలు బయటే ఉంచండి. ప్లాస్టిక్ మీద ఎక్కువ సేపు కరోనా ఉంటుంది. అయితే, లక్ ఏంటంటే... ప్లాస్టిక్ ప్యాకింగ్ లను బట్టల సబ్బుతో క్లీన్ చేసుకోవచ్చు.
  2. ఇతరు ప్యాకుల్లో కరోనా వెంటనే ప్రభావం కోల్పోతుంది. కాబట్టి 3-4 గంటల అనంతరం ఇంట్లో ఏదైనా బాల్కనీలో ఎవరూ తాకని చోట పెట్టండి.
  3. కూరగాయల వంటివన్నీ వేడి ఉప్పు నీటిలో కడగడం. అయితే మీ అవసరాల కంటే కొన్ని రోజుల ముందే సరుకులు తెచ్చుకుంటే దాదాపు ఈ ప్రమాదం తప్పించుకోవచ్చు.
  4. శుభ్రపరిచినా కూడా ఒక రోజు తర్వాత మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి. ఉంచకపోతే మరీ మంచిది. అది కూడా ప్రత్యేక బాక్సులో ఉంచితే బెటర్. 
  5. ప్రతి వస్తువును బట్టి జాగ్రత్త పాటించండి.
  6. మాంసం బయట నుంచి తెస్తే... గడప బయటే పెట్టి సరిగ్గా వండేటపుడు కిచెన్ వాష్ ఏరియాలో క్లీన్ చేసి కట్ చేసి కూరలో వేశాక... మీ చేతులు సబ్బుతో కడుక్కోండి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బయట నుంచి తెచ్చిన వస్తువులు పెట్టకండి.

ఇక కరెన్సీ నోట్ల జాగ్రత్తలు ఎలా అనే దానిపై గతంలో నమస్తే ఆంధ్ర రాసిన ఈ కింది వ్యాసం చదవండి.

http://www.namasteandhra.com/news/post/how-to-avoid-corona-via-currency-notes?cat=Life%20Style