కరోనా టెస్ట్ చేస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

August 13, 2020

యావత్తు ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కోవిడ్- 19 వైరస్ తప్పించి వేరే మాటే వినిపించడం లేదిప్పుడు. ఎక్కడ చూసినా కరోనా మాటే. ఏ పత్రిక చూసినా, ఏ టీవీ ఛానెల్ చూసినా కరోనాకు సంబంధించిన వార్తలే. అసలు ఇతర విషయాలన్నింటిని కూడా కరోనా కనిపించకుండా చేసింది. సరే.. మరి ఇన్నేసి వార్తలు కరోనా గురించే వస్తున్నా... అసలు కరోనా టెస్ట్ ఖరీదు ఎంత? ఎక్కడ చేస్తారు? ఎలా చేస్తారు? అన్న వివరాలేమైనా ఇప్పటిదాకా వచ్చాయా? అంటే.. లేదనే చెప్పాలి. అసలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే చోటెక్కడ? అన్న విషయంపై కూడా మనకు అంతగా అవగాహన లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ దిశగా పూర్తి అవగాహన కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సవివర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలకు అయ్యే ఖర్చును కూడా కేంద్రం ఖరారు చేసింది.

కరోనా నిర్ధారణ పరీక్షకు కేవలం రూ.4,500 అవుతుందట. ఇంతకు మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మొత్తంలో స్క్రీనింగ్ టెస్ట్ కు రూ.1,500, నిర్ధారణ టెస్ట్ కు రూ.3 వేలు వసూలు చేాయాలట. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ (ఎన్ఏబీఎల్) నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్ ల్యాబ్ ల్లోనే ఈ పరీక్షలు నిర్వహించేందుకు కూడా కేంద్రం ఆంక్షలు విధించింది. కరోనా టెస్ట్ లకు రేట్లు ఖరారు చేసిన కేంద్రం... ఈ రేట్లను మరింత తగ్గించేందుకు కృషి చేయాలని కూడా ప్రైవేట్ ల్యాబోరేటరీలకు కేంద్రం పిలుపు ఇచ్చింది.