జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణ

August 11, 2020

నిన్నటి నుంచి 1 మిలియన్ మార్క్ అంటూ ఏపీలో కరోనా పరీక్షలపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం బూటకం అని చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

మొదట్నుంచి ప్రతి విషయంలో ప్రజలను మోసం చేస్తున్న జగన్, చివరకు వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఆరోగ్యం విషయంలోను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 

అసలు ఏపీ టెస్టులు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. 

కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని, లేకపోతే పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. 

​చంద్రబాబు సడెన్ గా ఈ ఆరోపణ చేయడానికి కొన్ని కీలక కారణాలున్నాయి.

మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కరోనా టెస్టులు చేశారు.

తర్వాత వాటి ఫలితాల్లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

కానీ ఆయన అనుమానంతో హైదరాబాదులో టెస్టులు చేయించుకుంటే ఇక్కడ నెగెటివ్ వచ్చింది.

దీంతో ఇదేం అన్యాయం అంటూ ఆయన ప్రభుత్వాన్ని అపుడు కడిగి పారేశారు. ఏదో ఒక పొరపాటు అని అపుడు వదిలేశారు. 

​తాజాగా ఏపీలో శాాంపిలే తీసుకోని వ్యక్తికి కరోనా పాజిటివ్ అంటూ మెసేజ్ పంపించారు.

అతను లబోదిబోమంటూ తన బాధతను ఒక వీడియోలో వివరించారు. చంద్రబాబు ఆ వీడియో షేర్ చేసి ఇంత దారుణమా? ఇంత మోసమో? అని ప్రశ్నించారు.​ 

కరోనా పరీక్ష​ల్లో స్కాం జరిగిందా? లేక పరీక్షలే ఒట్టి మాయనా? ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా జరిగి ఉండాలని సంచలన ఆరోపణలు చేశారు.

దయచేసి ప్రజలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.