షాక్ - కరోనా లేటెస్ట్ సంచలనాలు

August 13, 2020

దేశంలో కరోనా విజృంభించి. ప్రతిరోజు కొత్త రికార్డులను సృష్టిస్తున్న ఇండియా ఈరోజు కూడా రోగుల సంఖ్యలో చరిత్ర సృష్టించింది. 

ఈ రోజు దేశంలో 15413 కొత్త కేసులు బయటపడ్డాయ. 306 మంది మరణించారు.

మొత్తం కేసులు సంఖ్య 4,10,461 కి చేరింది. మొత్తం మృతులు 13254 మంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.

ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిడదవోలు ఎమ్మెల్యే గన్ మెన్ కి కరోనా సోకింది. దీంతో ఎమ్మెల్యేకు టెస్టులు చేస్తున్నారు.

ఏపీలో 491 కొత్త కేసులు రాగా, రాత్రి తెలంగాణలో 546 కేసులు వచ్చాయ. అత్యధికం హైదరాబాదు కేసులే. 

తమిళనాడులో భారీగా కేసులు వస్తున్నా.... దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పగడం గమనార్హం. 

హైదరాబాద్ హాట్ స్పాట్ గా మారుతుండటంతో వీలున్న వారంత సొంతూరికి పయనం అవుతున్నారు.