తెలుగు వాళ్లు అదృష్టవంతులే

August 14, 2020

ఇటీవల ప్రధాన మంత్రులతో సీఎంల వీడియో కాన్ఫరెన్స్ జరిగిన సందర్భంగా కేసీఆర్ వ్యాక్సిన్ గురించి ప్రధానితో మాట్లాడారు. ఆగస్టులోపు వ్యాక్సిన్ వస్తుంది. అది కూడా మన ఇండియా నుంచే, హైదరాబాదు నుంచే వస్తుందని చాలా కాన్పిడెంట్ గా చెప్పారు. తను స్వయంగా మీడియా లైవ్ లో కూడా ఇదేమాట చెప్పారు. అయితే... హైదరాబాదు నుంచి వ్యాక్సిన్ వచ్చినా, ప్రపంచం నుంచి వేరే ఏ దేశం నుంచి వచ్చినా... ఇండియన్లు, తెలుగు వారు అదృష్టవంతులు అని చెప్పాలి.

వ్యాక్సిన్ ఈ ప్రపంచంలో అత్యధిక క్వాంటిటీలో అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగిన సదుపాయాలు కేవలం హైదరాబాదులోని ఫార్మా కంపెనీలకు ఉన్నాయి. హైదరాబాదు ప్రపంచ ఫార్మా హబ్ లో ప్రముఖమైనది. ఈ కారణం వల్లే మలేరియా మందును మనం ఇటీవల 55 కంట్రీలకు ఎగుమతి చేశాం. 

ప్రముఖ కంపెనీలన్నీ ఫార్మా రంగంలోనివి హైదరాాబాదులోనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో దీనిని ఆర్గనైజ్డ్ గా తీర్చిదిద్ది జీనోమ్ వ్యాలీ అని ఏర్పాటుచేశారు. ఇపుడు ప్రపంచంలో వ్యాక్సిన్ పై కీలక ప్రయోగాలు చేస్తున్న కేంద్రాల్లో ఇది ఒకటి. ఇది చంద్రబాబు ఏర్పాటుచేసినదే అని స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కొంతకాలం క్రితం అసెంబ్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే.

అది పక్కన పెడితే ఫార్మా రంగంలో మనకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల, మన వద్ద ఉన్న సదుపాయాల వల్ల... వ్యాక్సిన్ మనమే కనిపెట్టే అవకాశాలు ఎంత మెండుగా ఉన్నాయో... మనకే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా అంతే మెండుగా ఉన్నాయి. బహుశా ప్రపంచంలో అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీకి మన మీదే ఆధారపడే అవకాశం ఉంది.

తాజాగా దీని గురించి ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి.... శాంతబయోటెక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డితో చేసిన చిన్న సంభాషణ మనకు ఎంతో భరోసా ఇచ్చింది. ఒకసారి ఆ వీడియో చూద్దామా?