అమోఘం - కరోనా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ సక్సెస్

August 10, 2020

ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కూడా ఉదృతంగా జరుగుతున్నాయి. ఏ దేశానికి ఆ దేశం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసంచలన వార్త వెలుగు చూసింది. రష్యా కు చెందిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్టు ప్రకటించారు.

చెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని రష్యా ప్రకటించింది. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో.. వాలంటీర్లపై తొలి వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలు ఇచ్చాయని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీస్‌తో తెలిపారు.

రష్యాకు చెందిన గమలీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను జూన్‌ 18న ప్రారంభించారు. పరీక్షలు చేపట్టిన తొలిగ్రూప్‌ వాలంటీర్లు బుధవారం డిశ్చార్జి కానుండగా.. రెండో గ్రూప్‌ ఈ నెల 20న డిశ్చార్జి అవుతారని తారాసోవ్‌ వెల్లడించారు.

ఈ దశలో వాక్సిన్‌ భద్రతను పరీక్షించడం జరిగిందని తెలిపారు. టీకా భద్రత నిర్ధారణ అయ్యిందని, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రణాళికలను ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. త్వరలో మరో దశ ప్రారంభం కానుందని తెలిపారు. అంటే ప్రస్తుతం అత్యంత వేగవంతమైన దశలో ఉన్న వాక్సిన్లు ఒకటి ఆక్స్ ఫర్డ్ అయితే, రెండు ఈరోజు ప్రకటించిన రష్యా వ్యాక్సిన్.

‘‘Sechenov University has successfully completed tests on volunteers of the world's first vaccine against COVID19. The vaccine is safe. The volunteers will be discharged on July 15 and July 20" - chief researcher Elena Smolyarchuk