కరోనా వెనుక.. వందేళ్ల సెంటిమెంట్ ఉందా?

June 03, 2020

మనమిప్పుడు 2020లో ఉన్నాం. అయితే ఏమిటన్న ప్రశ్నను యథాలాపంగా అయినా మనసులోకి రానివ్వకండి. ఎందుకంటే.. 2020కి ముందు ప్రతి వందేళ్లకు ప్రపంచాన్ని వణికించే కొత్త వైరస్ పుట్టుకొచ్చే సెంటిమెంట్ ఉంటుందని చెబుతున్నారు. చెప్పేటోళ్లు ఏన్నైనా చెబుతారని కొట్టిపారేయొద్దు. తమ వాదనకు తగ్గ సాక్ష్యాలతోనే వారు మాట్లాడటం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం.
1720లో ప్లేగ్ ప్రపంచాన్ని ఎంతలా కబళించిందో.. ఎన్ని లక్షల ప్రాణాలు పోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జరిగిన వందేళ్లకు అంటే.. 1820 వచ్చేసరికి క్లోరా అవుట్ బ్రేక్ పుణ్యమా అని మానవాళిని కబళించివేసింది. కోట్లాది మంది దీనికి బలయ్యారు. ఈ విషాదం నుంచి బయటపడి.. కాస్త తేరుకునేసరికి మరో సవాలు వచ్చిపడింది. అది కూడా వందేళ్లకు కావటం గమనార్హం.
1920లో స్పానిష్ ఫ్లూ కారణంగా లక్షలాది మంది మరణించారు. ప్రపంచాన్ని వణికించిన ఈ ఫ్లూ తర్వాత మళ్లీ వందేళ్లకు చైనీస్ కరోనా వైరస్ ప్రపంచ ప్రజల్ని ఎంతలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇది కూడా సరిగ్గా వందేళ్లకు అంటే 2020కి రావటం విశేషం. ఇదంతా చూసినప్పుడు ప్రతి వందేళ్లకోసారి మానవాళికి వైరస్ తో ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఇట్టే అర్థం కాకమానదు. వందేళ్ల సెంటిమెంట్ లెక్కల్ని చూసినప్పుడు ఒళ్లు జలదరించక మానదు.