వెరీ వెరీ బ్యాడ్ డే... OMG

August 10, 2020

కరోనా కేసులు ఎన్ని పెరిగినా మన వద్ద మరణాలు తక్కువగా నమోదవుతున్న ఒక హోప్ ఇంతకాలం ఉండింది.

కానీ తాజాగా ఈరోజు భయంకరమైన సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో 2003 మంది కరోనాతో మరణించారు. వీటిలో ఒక్క మహారాష్ట్రవే 1409 మరణాలు కాగా, ఢిల్లీవి 437.

కోవిడ -19 వచ్చాక దేశంలో అత్యధిక కేసులు నమోదైంది ఈరోజే కావడం గమనార్హం.

భారత్ కరోనా చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. 

వరుసగా 6వ రోజు కేసులు పదివేలు దాటాయి. ఈరోజు 10974 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,54,065కి చేరింది.

ఇండియాలో రికవరీ రేటు 52.79 శాతానికి చేరుకోవడం గమనార్హం.