ఈటల షాకింగ్ వ్యాఖ్యలు... దేశమంతటా ఆశ్చర్యంగా చూస్తోంది

August 09, 2020

ఈటల రాజేంద్రప్రసాద్ ఒక ఆరోగ్య శాఖ మంత్రి. ప్రస్తుతం దేశమంతటా హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న సమయంలో ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. కానీ ప్రభుత్వ పెద్దల ఇమేజ్ కోసం ఏదిపడితే అది మాట్లాడితే... చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణను హైకోర్టు ఏకిపారేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈటల మాటలు అత్యంత విస్మయాన్ని కలిగించేలా ఉన్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పై సమీక్ష సమావేశానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఉన్న వైరస్ కి మనుషులను చంపే శక్తి లేదు అని వ్యాఖ్యానించారాయన. కరోనా మరణాల్లో గోప్యత లేదన్నారు. ప్రతి రోజు బులిటెన్లో ఒకవైపు మరణాలు లెక్కకడుతున్నారు. వాటిలో ఇతర వ్యాధులుండి కరోనాతో చనిపోతే లెక్కవేయడం లేదని కూడా వారే చెప్పారు. మళ్లీ అదేనోటితో మా దగ్గర కరోనాకి ఎవరినీ చంపేశక్తి లేదంటున్నారు.

వాస్తవానికి ప్రపంచమంతటా... కరోనాని అతిపెద్ద పాండెమిక్ అని లెక్కగట్టారు. ఇందులో అనేక స్ట్రెయిన్స్ ఉన్నాయి. తెలంగాణలోనే సుమారు 150 రకాల కరోనా రకాలున్నాయి. అలాంటపుడు ఆరోగ్య మంత్రి స్వయంగా తెలంగాణలో వైరస్ కి  చంపేశక్తి లేదనడం ఆశ్చర్యకరమే.

కరోనా మరణాల్లో ఎలాంటి గోప్యత లేదు, గోప్యత ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పిన ఈటల తెలంగాణలో సాధారణంగా రోజుకు వెయ్యిమంది చనిపోతారు. అవన్నీ కరోనా చావులు కాదు..ఎలా చనిపోయినా కరోనాతో చనిపోయినట్టు భయపడుతున్నారు అని అన్నారు.  కరోనా సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఉంది.

ఎంజీఎంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులన్నీ ఎంజీఎంలో చికిత్స అందిస్తాం.. కుటుంబ సభ్యులే కాదనుకుంటున్న వారికి వైద్యులు ట్రీట్మెంట్ చేయడం గొప్ప విషయం... మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వెంటనే వివరణ ఇవ్వండి అంటూ అధికారులు ఆదేశించారు.

Read Also

HYD: సర్కారు బడిని తనఖా పెట్టేసుకుని లోనిచ్చేసిన బ్యాంకు
ఉద్యోగం పోయిందని ఏడ్చేవాళ్లు సిగ్గుపడండి ఈ అమ్మాయిని చూసి
తెలంగాణ బులిటెన్ లో కేసీఆర్ చతురత... వాట్ నెక్ట్స్