భారతదేశంలో కరోనా లేని ఏకైక ప్రాంతం... 

August 08, 2020

దేశమంతటా కరోనా విలయతాండవం చేస్తోంది. కానీ మనదేశంలో ఒక్క ప్రాంతంలో మాత్రం కరోనా లేదు. రాదు కూడా.

ఇది నమ్మలేని నిజంగా అనిపిస్తుంది కదా అవును. అయినా నమ్మక తప్పదు.

భారతదేశంలోని 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్ లో ఇప్పటవరకు కరోనా కేసు నమోదు కాలేదు.  ఇ

క ముందు కూడా అక్కడ కేసులునమోదయ్యే అవకాశం లేదు. ఇది ఎలా సాధ్యమైంది?

లక్ష్మద్వీప్.. భారత్ కు పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న కొన్ని చిన్నదీవుల సముదాయం. ఇందులో 36 దీవులుంటాయి. జనాభా 64 వేలు. 

టూరిజంపై నిషేధం ఉండటంతో ఎవరూ కొత్త వారు రావడం లేదు.

ఇతర ప్రాంతాల్లో పనిచేసే స్థానికులు కూడా టెస్టు చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ తో వస్తేనే రానిస్తారు. లేకపోతే లేదు. 

ఇప్పటివరకు అక్కడ 61 మంది అనుమానితులకు మాత్రమే టెస్టులు చేశారు.

వారందరికీ నెగెటివ్ వచ్చిందని  లక్షద్వీపు హెల్త్ సెక్రటరీ డాక్టర్ ఎస్. సుందరవడివేలు తెలిపారు. బయట టెస్టు చేసుకుని నెగెటివ్ వచ్చిన స్థానికులను కూడా 20 రోజుల క్వారంటైన్ తర్వాతే ఇంటికి పంపిస్తున్నారు.

లక్షద్వీపు (Lakshadweep) గురించి తెలుసా...

ఈ దీవులకు రాజధాని కవరత్తి (Kavaratti). ఇక్కడ ప్రధాన దీవులు నాలుగు... కవరత్తి, అగట్టి, మినికోయ్, అమిని (The main islands are Kavaratti, Agatti, Minicoy, and Amini).  టూరిజమే ప్రధాన ఆదాయం.

బెంగుళూరు, కోచి నుంచి మాత్రమే లక్షద్వీప్ కి ఫ్లైట్స్ ఉంటాయి. కోచి నుంచి షిప్స్ లో వెళ్లొచ్చు. కేరళలోని ఈ కోచి నుంచే వారికి అవసరమని అన్ని వస్తువులు, సేవలు గవర్నమెంటు సరఫరా చేస్తుంది.

అధికారిక భాషలు మళయాళం, ఇంగ్లిష్. మన ఉమ్మడి ఆంధప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1, 1956 న ఇది ఏర్పడింది.