మీడియాకు భయపడుతున్న టి సర్కారు... రీజనిదే

May 26, 2020

ఈ రోజు ప్రముఖ దినపత్రికలు.. టీవీ చానళ్లు కవర్ చేసిన న్యూస్.. హైదరాబాద్ లో కరోనా? అయితే.. హెడ్డింగ్ చివరన క్వశ్చన్ మార్క్ పెట్టటంతో అంతో ఇంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి. మీడియా వార్తల్ని చూస్తే.. ఇద్దరు చైనీయుల విషయంలో కరోనా ఉందన్న సందేహాలు వ్యక్తం కావటమే కాదు.. వారికి చేసిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని.. రెండోసారి టెస్టు చేసినట్లుగా మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. కాకుంటే.. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని పేర్కొన్నారు.
దీంతో.. కరోనా మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఈ ప్రాణాంతక వైరస్ కు మందు లేకపోవటమే కాు.. దీని కారణంగా ఇప్పటికే చైనాలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వస్తున్న కరోనా వార్తలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్ లో కరోనా ఎవరికీ కన్ఫర్మ్ కాలేదని చెప్పిన ఆయన.. మీడియా సంయమనం పాటించాలన్నారు.
కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో ఎవరికి ఇప్పటివరకూ కన్ఫర్మ్ చేయలేదని స్పష్టం చేసిన మంత్రి ఈటెల.. మీడియా సంయమనం పాటించాలని కోరారు. కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన వారెవరికీ ఇప్పటివరకూ వ్యాధి నిర్ధారణ కాలేదని మంత్రి చెబుతున్నారు. కరోనా లేదని అదే పనిగా చెబుతున్న మంత్రివర్యులు.. మీడియా రిపోర్టుల్లో పేర్కొన్నట్లుగా చైనీయులకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగా పేర్కొన్న వేళ.. సదరు చైనీయుల గుురంచి మంత్రి ప్రస్తావించి.. వివరణ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.