కరోనా బాంబు పేల్చిన కేంద్రమంత్రి

August 11, 2020

ప్రపంచ దేశాల్లో కరోనా విలయం ఘోరంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే, భారత్ కు కొంచెం ఆలస్యంగానే ఈ వ్యాధి సోకింది. కాకపోతే మిగతా దేశాల కంటే మన దేశంలో ఇది ప్రమాదకరమనే భావించాలి. ఎందుకంటే... ఇక్కడ జనాభా ఎక్కువ. ఆరోగ్య అవగాహన, అంటు వ్యాధుల అవగాహన తక్కువ. సరైన జాగ్రత్తలు తీసుకోరు. కాబట్టి మిగతా చోట్ల కంటే మన వద్ద వేగంగా విస్తరించడానికి ప్రమాదం ఉంది.

అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని తీవ్రంగా జాగ్రత్తలు సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కరోనా పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు 28 మందికి ఇండియాలో కరోనా సోకినట్లు మంత్రి వెల్లడించారు. అయితే... మంత్రి ప్రకటించిన కొద్దిసేపటికే హైదరాబాదులోని మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలో మరొక యువతికి కరోనా సోకినట్లు తేలింది. 

కేంద్ర, రాష్ట్రాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విదేశాలలో కొన్ని దేశాలకు  విమాన సర్వీసులు ఆపేశారు. ప్రస్తుతం నడుస్తున్న దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ చేస్తున్నారు. కరోనా కేసులు వచ్చిన చోట మూడు కిలోమీటర్ల పరిధిలో పారిశుద్ధ్యం పకడ్బంధీగా ఏర్పాటుచేస్తున్నారు. విదేశీయులను పంపిద్దాం అంటే... ఆ దేశాలు తమ సొంతవారిని రానివ్వడం లేదు. దీంతో కరోనా సోకిన 16 మంది ఇటలీ టూరిస్టులను ఇండియాలోనే ఒక ప్రాంతంలో ఉంచి చికిత్స చేస్తున్నారు.