కరోనా: గవర్నమెంటుకి డాక్టరు బ్లాక్ మెయిల్

July 01, 2020

ఏదైనా సమస్య వచ్చిన వెంటనే.. దాని మీద పోరాడే కంటే కూడా.. వినూత్న రీతిలో బెదిరింపులకు దిగుతున్న వైనం సంచలనంగా మారుతోంది. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దగ్గర దగ్గర వారం క్రితం హైదరాబాద్ లో ఇద్దరికి కరోనా పరీక్షలు జరిపితే పాజిటివ్ వచ్చిందన్న వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఈ తప్పుడు వార్తను లీకులు ఇచ్చి భయాందోళనలకు గురయ్యేలా చేసింది గాంధీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వసంత్ కుమార్ అని తేల్చిన వైద్య ఆరోగ్య శాఖ.. ఆయన్ను శాఖకు సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్ వసంత్.. తన మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ.. తనను తాను కాల్చుకొని చనిపోతానంటూ డాక్టర్ మొండిగా వ్యవహరించటంతో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
తన తప్పు లేకున్నా తనను బలి చేస్తున్నారని.. ఆసుపత్రిలో వసతుల లేమి మీద ప్రశ్నించటంతో తనపై వేటు వేశారన్న ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖామంత్రిని కలిశానని.. ఆయన నుంచి ఎలాంటి హామీ లభించలేదన్నారు. ఈ పరిణామంతో గాంధీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Read Also

గుడికోసం ఎంఐఎం వినతిపత్రం... కథేంటి?
కేసీఆర్ బర్త్ డేకి కేటీఆర్ అడ్వాన్స్ ప్లానింగ్
మీడియాకు భయపడుతున్న టి సర్కారు... రీజనిదే