కరోనా వెనుక సంచలన విషయం వెలుగులోకి..

August 14, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి చైనా దుర్మార్గపు ఆలోచనే కారణమన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రత్యర్థి దేశాల్ని దెబ్బ తీసేందుకు జీవాయుధం తయారు చేసే ప్రయత్నం బూమరాంగ్ అయి.. ఆ దేశాన్నే కబళించే పరిస్థితి వచ్చిందన్న ప్రచారం మరింత ఊపందుకుంటోంది. జీవాయుధం తయారీ కోసం చైనా.. అమెరికా నానో సైంటిస్టు చార్లెస్ లీబర్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను అమెరికాలోనే ఉంటూ చైనాకు సాయపడినట్లు తెలుస్తోంది. చైనా నుంచి లీబర్ ఆర్థిక సాయం పొందుతున్నట్లు గుర్తించిన అమెరికా.. అతణ్ని అరెస్టు చేయడం గమనార్హం. లీబర్ సలహాల మేరకు చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో రహస్యంగా ఓ జీవ-రసాయన ల్యాబ్ నెలకొల్పి జీవ ఆయుధం తయారు చేసే ప్రయత్నం చైనీయులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సైంటిస్టుకి సాయపడ్డ ఓ విద్యార్థిని కూడా అమెరికన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లీబర్ సాయంతో వుహాన్‌లో జీవాయుధం తయారు చేస్తుండగా.. అది బయటికి వ్యాప్తి చెంది మనుషులకు సోకిందని.. చాలా వేగంగా విస్తరించే గుణం ఉన్న ఈ వైరస్ వేల మందిని కబళించిందని అంటున్నారు. చైనా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం కరోనా వైరస్‌తో చనిపోయింది వందల మందే కానీ.. నిజానికి వేల సంఖ్యలో మృతులున్నారని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. మొత్తానికి ప్రత్యర్థి దేశాలకు పైకి ప్రయోగించాలనుకున్న వైరస్ ఇప్పుడు.. తమ మెడకే చుట్టుకుని చైనా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీని వల్ల అమాయకులైన సామాన్య ప్రజలు చనిపోతుండటంతో వైరస్‌ను ఎలా కట్టడి చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనాను నియంత్రించడం కష్టమవుతోంది. అమెరికన్ సైంటిస్టు నిజంగానే చైనాకు సాయపడినట్లు తెలిస్తే అతడిపై కోర్టులో కఠిన దండనే పడే అవకాశముంది.