కరోనా... పేరు ఎందుకు మార్చారు?

July 08, 2020

చైనాలో పుట్టి.. పలు దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ ఎంతలా హడలెత్తిస్తుందో తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ ను పిలుస్తున్న పేరు.. దాని అసలు పేరు కాదు. కరోనా అన్నది కొన్ని వైరస్ సమూహాలకు సూచించే పేరు. ఇప్పుడు చెలరేగిపోతున్న వైరస్.. అందులో ఒకటే తప్పించి అదే కరోనా కాదు. ఈ గందరగోళం లేకుండా ఉండేందుకు విశ్వాన్ని వణికిస్తున్న వైరస్ కు కొత్త పేరు పెట్టాలని కొద్ది రోజులుగా అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగింది.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు విస్తరిస్తున్న వైరస్ కు కొత్త పేరును కన్ఫర్మ్ చేసింది. కోవిడ్ 2019గా ఇకపై వ్యవహరించనున్నారు. ఇప్పుడు కరోనాగా పిలుస్తున్న వైరస్ ను ఇకపై కోవిడ్ 19గా వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తప్పించేందుకు ఈ కొత్త పేరును డిసైడ్ చేశారు.
తాము పెట్టిన పేరు మీద ఒక భూభాగం కానీ జంతువు కానీ.. ఏ జాతికి కానీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పేరు కేవలం వ్యాధిని మాత్రమే తెలియజేస్తుందన్నారు. ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకూ వెయ్యికి పైగా మరణించారు. అంతకంతకూ విస్తరిస్తున్న ఈ వైరస్ కు చెక్ పెట్టే మందు ఎప్పటికి సిద్ధమవుతుందన్నది తేలట్లేదు.