జగన్ గారూ నిజమే దేశం మనల్ని చూస్తోంది

August 13, 2020

ప్రమాణ స్వీకారం చేయగానే... దేశానికి ఆదర్శంగా నిలుస్తాం, దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తాం అని అప్పట్లో మన జగన్ గారు భలే చెప్పారు. గుర్తుందా? సరిగ్గా ఏడాది మీద నెల. నిజమే దేశం మనవైపే చూస్తోంది. ఇవాళ ఎలా ఆదర్శం అయ్యాం? అనేది గమనించారా?

మహారాష్ట్ర నమోదైన కేసులు - 9895

ఆంధ్రప్రదేశ్ లో కేసులు - 8000

భలే సాధించాం కదండీ... కేసుల్లో 2వ స్థానంకి ఎదిగాం. దేశం మనవైపు చూస్తోంది. మన ఎదుగుదలను కూడా చూస్తోంది. మరణాల్లో కూడా ఏం తక్కువ కాదండోయ్.. అందులోను నాలుగో స్థానం. రోజూ అదేదో రికార్డు కొట్టడానికన్నట్టు నమోదవుతుంది. దీనిని ప్రభుత్వం తప్పు ఎలా అంటామంటే ఎవరేం చెబుతారు. రాజమండ్రిలో చనిపోయిన జర్నలిస్టు మరణానికి కారణం ఏంటో లోకం కోడై కూస్తోంది... ! అది తెలుసుకోండి... తప్పెందుకో మీకు అర్థమవుతుంది. మరి జనం తప్పు లేదా అటా... యథా రాజా, తథా ప్రజ. 

ఇంకా రికార్డులు అయిపోలేదు. టాప్15లో ఆరు జిల్లాలు మనవే. ముంబై, చెన్నై, ఢిల్లీ, హైద్రాబాద్, కలకత్తాలను దాటిన తూర్పుగోదావరి నాలుగో స్థానానికి ఎగబాకింది. గ్రామీణ జిల్లాల్లో అయితే ఇదే టాప్. మనకున్నవి 13 జిల్లాలు. దేశంలో కరోనా టాప్ 30లో 9 మనవే. దేశం ఏం కర్మ -ప్రపంచంతోనే పోటీ పడ్డాం. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే ఏపీ ర్యాంకు 30. ఇంటర్నేషనల్ లెవల్లో కూడా మన డామినేషనే.

 

కరోనానే కాదండీ...

దళితులపై దాడుల్లో మనమే టాప్, 

ఆడపిల్లలపై రేప్ లలో మనమే టాప్,

అప్పులు చేయడంలో మనమే టాప్,

మద్యం రేట్లలో మనమే టాప్,

పెట్రోలు ధరల్లో మనమే టాప్,

అక్రమ మద్యం స్మగ్లింగ్ లో మనమే టాప్... నిజంగానే దేశం మనల్ని చూస్తోందండీ !