కొన్ని గుడ్ న్యూస్ లు చెప్పిన కేంద్రం

August 14, 2020

తాజా కోవిడ్ అప్ డేట్ లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని శుభవార్తలు చెప్పింది. ఇంతవరకు కోవిడ్ నమోదైన రాష్ట్రాల్లో తొలిసారి ఒక రాష్ట్రం ‘కరోనా ఫ్రీ స్టేట్ ‘గా డిక్లేర్ చేసినట్లు వెల్లడించింది. కేరళ ముందుగా దీన్నుంచి బయటపడుతుందని అందరూ అనుకున్నారు గానీ తక్కువ కేసులు నమోదైన గోవా ఈ ఉపద్రవం నుంచి పూర్తిగా బయటపడింది. అక్కడ నమోదైన మొత్తం కేసులు 7. వారంతా కోలుకుని ఇంటికెళ్లారు. ఈశాన్య రాష్ట్రంలోని నాగాలాండ్ లో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మొత్తానికి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కరోనా జీరో. ఇది పెద్ద గుడ్ న్యూస్. 

కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ కోవిడ్ వ్యాప్తిని బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాయని అన్నారు. మన దేశంలో కేసులు రెట్టింపు రేటు 7.5 రోజలుగా ఉందన్నారు. 18 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఈ విషయంలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కేంద్రం తెలిపింది. కేరళలో కేసుల సంఖ్య డబుల్ అవడానికి 72 రోజులు పడుతోందని, ఒడిసాలో అందు 40 రోజులుగా ఉందన్నారు. ఇంతకుమునుపు కేసులు ఉండి... కొత్త కేసులు నమోదు కాని జిల్లాలు దేశంలో 59 ఉన్నాయన్నారు. 

దేశ వ్యాప్తంగా 2546 మంది కోరుకున్నారని కేంద్రం తెలిపింది. అంటే ఇది నమోదైన కేసుల్లో 14.75 శాతం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ విషయంలో మనం మెరుగ్గా ఉన్నాం. ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతం కేసులను భాగా కంట్రోల్ చేస్తోంది. మన వద్ద తమిళనాడులో బాగా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం బాగా పనిచేస్తోందనే చెప్పాలి. 

ఈ సాయంత్రం వరకు గత 24 గంటల్లో కొత్త కేసులు 1540గా ఉన్నాయి. మొత్తం కేసులు17656కి చేరాయి. దీనికి రెండు కారణాలు.. టెస్టులు కూడా పెరగడం ఒక కారణం అయితే... 5 రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొంచెం దారుణంగా ఉండటం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో 4203, ఢిల్లీలో 2003 కేసులు, గుజరాత్ లో 1851, మధ్యప్రదేశ్ 1485, రాజస్థాన్, 1478, తమిళనాడు 1477, యూపీ 1176 కేసులు నమోదు చేశాయి. కేవలం 7 రాష్ట్రాల్లోనే కేసులు బాగా నమోదవుతున్నాయి. మొత్తం 32 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుంటే.. ఈ ఏడు రాష్ట్రాల్లో 75 శాతం కేసులున్నాయి.