ఇలాంటి పనులు సరదాకి కూడా చేస్తారా జగన్

May 27, 2020

ఏంటి... ఎవరైనా పాజిటివ్ ఉన్నవాళ్లు జగన్ ని కలిశారా? జగన్ ను ఎందుకు టెస్టు చేశారు? ఏమైనా ఫ్లు లక్షణాలు ఉన్నాయా? అని కంగారు పడుతున్నారా? అదేం లేదు. ఈరోజు కేంద్రం అన్ని రాష్ట్రాలకు కొత్త పెద్ద సంఖ్యలో కిట్లను పంపింది. ఏపీకి కూడా లక్ష కిట్లు వచ్చాయి. వీటిని అదేదో సంబరం లాగా జగన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

అయితే, సరేకొత్తవి కదా... అని ముఖ్యమంత్రితో ప్రారంభిద్దాం టెస్టులు అని ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపారు. జగన్ కి లక్షణాలు లేవు, ఎవరితో కాంటాక్ట్ అవలేదని తెలిసి కూడా ఒక కిట్ ను వృథా చేశారు అధికారులు. ఇంత సీరియస్ సిచ్యుయేషన్లో ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఏపీ అధికారులను ఏమనాలో అర్థం కాదు. నిరంతరం ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘనల వల్లే దేశంలో అతి ఎక్కువ ప్రాంతం రెడ్ జోన్ గా నోటిఫై అయ్యింది. ఇది ప్రజల సాధారణ జీవితాలను దెబ్బతీసింది. తాజాగా ఈ లాంచ్ ప్రోగ్రాంలో ఆరేడు మంది పక్క పక్కనే నిలబడి ఒకే కిట్ ను పట్టుకున్నారు. ఇది లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధం. అయినా ర్యాలీలే తీసిన రాష్ట్రంలో ఇదో లెక్కా ? చెప్పండి...

వీలైనంత త్వరగా మాస్ టెస్టింగ్ జరిపి ఏపీ నుంచి ముప్పి తప్పించాల్సిన ముఖ్యమంత్రి ఈ విషయాలను ఇంత సరదాగా తీసుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఏపీని ఆ దేవుడే కాపాాడాాలేమో.