ఆ రెండు పార్టీలకు చివరి దినాలు మొదలు

April 01, 2020

ప్రజల సమస్యలపై పోరాటమే తమ జీవితాశయం అని చెప్పుకునే వామపక్షాలకు ఇప్పుడు పెద్ద దెబ్బే తగిలింది. గతంలో ఓ మోస్తరులో, కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ప్రధాన రాజకీయ పార్టీలకే ముచ్చెమటలు పట్టిాంచిన సీపీఎం, సీపీఐలకు నిజంగానే ఇప్పుడు పెద్ద దెబ్బే తగిలిందని చెప్పాలి. ఇప్పటిదాకా ఈ రెండు పార్టీలకు కొనసాగుతున్న జాతీయ పార్టీల హోదాను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో ఇకపై ఈ రెండు పార్టీలకు జాతీయ హోదా కొనసాగదు. పార్లమెంటులో ఉన్న ఒకరిద్దరు సభ్యులు కూడా ఇప్పుడు కూర్చుంటున్న తొలి వరుస నుంచి వెనుక బెంచీలకు మారాల్సిందే.

గడచిన కొంతకాలంగా ఎన్నికల్లో ఈ పార్టీల ఫెర్ ఫార్మెన్స్ చాలా పూర్ గా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవలే పార్లమెంటులోని సీపీఎం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని కూడా సీపీఎం ఖాళీ చేయాల్సి వచ్చింది. తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో సీపీఎంతో పాటు సీపీఐ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. అయినా సీపీఎం,. సీపీఐ పార్టీలకు ఉన్న జాతీయ పార్టీ హోదాను ఈసీ ఎందుకు రద్దు చేసిందన్న విషయానికి వస్తే... ఏదేనీ పార్టీకి జాతీయ హోదా రావాలంటే... కొన్ని నిబంధనలను ఆయా పార్టీలు పాటించాలి. ఈసీ నిర్దేశించిన కొన్ని విషయాల్లో సత్తా చాటాల్సి ఉంది. ప్రత్యేకించి ఓట్లు, సీట్లు లెక్కన నిర్దేశిత సంఖ్య మేర సీట్లు, ఓట్లు సాధించాలి.

ఆ నిబంధనలేమిటంటే... చివరగా జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఆ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీానితో పాటు ఏదేనీ రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. రాష్ట్ర పార్టీ హోదా ఉండాలంటే... ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం రెండు అసెంబ్లీ సీట్లైనా గెలవాలి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు రావాలి. దీంతో పాటు ఓ ఎంపీ సీటును గెలవాలి. ఈ లెక్కన సీపీఎం, సీపీఐలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చాలా పూర్ ఫెర్ ఫార్మెన్స్ నే చూపాయి. సింగిల్ సీటు రాకపోగా... ఓట్ల శాతం కూడా భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎర్ర పార్టీలకు జాతీయ పార్టీల హోదాను రద్దు చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.