ఎన్నికల కమిషన్ కు తలకాయ లేదు

February 24, 2020

ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని చంపడానికి ఉందో, బతికించడానికి ఉందో అర్థం కావడం లేదని సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈసీ పెద్దలకు తలకాయ లేదన్నారు. అందుకే వారిలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. ఓటర్లకు అభ్యర్థులు 5-6 వేలు పంచుతుంటే ఈసీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కొందరిని టార్గెట్ చేసి వేధించడానికి, ప్రజస్వామ్యాన్ని నాశనం చేయడానికి పని చేయడంలో ఈసీ బిజీగా ఉందా అని ప్రశ్నించారు. ఈసీ అందరి రిక్వెస్టులను పరిశీలించాలి. కానీ కొందరివే పట్టించుకుంటోంది. ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది ప్రజలే కదా. ఎన్నికలు సరిగా నిర్వహించకుండా మీనమేషాలు లెక్కిస్తూ అనవసర విషయాల్లో రాద్ధాంతం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అధికారులు ముఖ్యమంత్రిని కలవకుండా అడ్డుకోవడంలో ఏమైనా అర్థముందా? పరిపాలన కోసమే కదా కలిసేది. అయినా... సీఎంను అడ్డుకోవడం ముఖ్యంగా... ఎన్నికలు సరిగా నిర్వహించడం ముఖ్యమా? ముందు ఈసీ ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
సీఎం అధికారులను కలవడానికి కూడా ఒప్పుకోకపోతే ఇక ఆపద్ధర్మ సీఎం అనడంలో అర్థమే లేదని... నిర్ణయాలు తీసుకోవడానికి సీఎంకు అనుమతి లేదు గాని పరిపాలనకు కచ్చితంగా అనుమతి ఉందని రామకృష్ణ చెప్పారు. ఎన్నికల కమిషన్ ముఖ్య విధి ఎన్నికల నిర్వహించడం. కానీ అందులో ఈసీ పూర్తిగా విఫలమైంది. పులివెందులలోని ఓ గ్రామంలో ఇరు పార్టీల అభ్యర్థులు వేలల్లో డబ్బులు పంచిదే ఎందుకు దానిని అడ్డుకోలేదు? అని నిలదీశారు. ఇవన్నీ వదిలేసి ముఖ్యమంత్రి కేబినెట్ భేటీని అడ్డుకోవడం ఏంటి? రాష్ట్ర సమస్యలపై సీఎం కేబినెట్‌ సమావేశం నిర్వహించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.