అవును, ఇది చంద్రబాబు మీద పగే - సీనియర్ లీడర్

February 22, 2020

‘‘అవును చంద్రబాబు మీద పగతోనే జగన్ అన్ని నిర్ణయాలను తిరగతోడుతున్నారు. చంద్రబాబును దెబ్బకొట్టాలన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. చంద్రబాబు చేసిన ఏ పనిని కొనసాగించకూడదని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో కక్ష సరికాదు. జగన్ వి అన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలే. ఒక నాయకుడు మంచా, చెడా అని చూడాలి గాని... ఎవరు చేశారు అని చూడకూడదు’’ ఇది సీపీఎం నేత నారాయణ జగన్ మీద చేసి వ్యాఖ్యలు. 

విజయవాడ రాజధాని ఉండాలన్నది మా డిమాండ్. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే మాడిమాండ్. అయితే... అభివృద్ధి ఫలాలు మాత్రం అందరికీ అందాల్సిందే. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాజధాని కట్టాలనుకుంది. ఇపుడు జగన్  ఇంకో మార్గంలో వెళ్తున్నారు. ఇద్దరితో తప్పే. ప్రజల కోణంలో ఆలోచించాలి. వ్యక్తిగత వైరుధ్యాలు రాష్ట్రానికి నష్టం చేయకూడదు.