అమరావతిలో జగన్ కొత్త ప్లాన్

August 12, 2020

నిజాన్ని చిద్రం చేయడం... కొత్త కలను అల్లడం... అమరావతి విషయంలో జగన్ సర్కారు చేసిన పని ఇదే. వద్దు మొర్రో, ఇపుడు అవసరం ఏంటి? అన్నా వినకుండా కొత్తగా మూడు రాజధానులు మొదలుపెట్టారు. విశాఖ, అమరావతి, కర్నూలు. కేంద్రం పని కూడా తానే చేస్తానంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. 

33 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల రైతులను కనీసం ఒక సమావేశానికి కూడా పిలవలేదు. పట్టుబట్టి సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయించారు. ఇపుడు కొత్తగా ఏఎంఆర్డీఏ -అమరావతి మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (AMRDA) ఏర్పాటుచేశారు. దీనిని నోటిఫై కూడా చేశారు. సీఆర్డీఏ ప్రాంతంతో పాటు కొత్త ప్రాంతాలు కూడా ఇందులో కలుస్తాయి. 

AMRDA (amaravati metropolitan development authority) కి ఒక ప్రత్యేక పాలన కమిటీని నియమించారు. దీనికి ఒక పురపాలక శాఖ కార్యదర్శి... ఉపాధ్యక్షుడుగా ఉంటారు. 11 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి AMRDA కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లావ కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా ఉంటారు. ఏఎంఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చింది. 

అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి. మూడు రాజధానుల్లో భాగంగా... ఈ రాజధానిని ఎలా తీర్చిదిద్దాలి. అక్కడ రియల్ ఎస్టేట్ మళ్లీ పెరగడానికి ఏం చెయ్యాలి? వంటివి ఆలోచిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే... చంద్రబాబు చెప్పిందే చేస్తారు. కానీ ఆ స్థాయిలో చేయరు. కానీ అమరావతి పేరు, సీఆర్డీఏ ఉంటే ఎంత చేసిన చంద్రబాబుకి క్రెడిట్ వస్తుందని దానిని చిదిమేశారు. 

జనం భాషలో చెప్పాలంటే... ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన నగరాన్ని రద్దు చేసి దాని స్థానే ఒక మామూలు నగరం నిర్మించే ప్రయత్నం. కారణం... చంద్రబాబు పేరును చెరిపేయడం. ఇదీ సంగతి. 

Read Also

షాకింగ్- కరోనాతో ఏపీ బీజేపీ నేత మృతి
​వైసీపీలో భారీ కుదుపు -  సీక్రెట్ మీటింగ్ ?
రాజధాని మార్చాలంటే... జగన్ ఆ పనిచేయాలి-  RRR